పేస్, మైనేనికి షాక్: నెలకు రూ. 50వేలు ఇవ్వడం లేదు

Posted By:

హైదరాబాద్: కేంద్ర క్రీడల మంత్రిగా బాధ్యతలను తీసుకున్న కొద్ది రోజుల్లోనే తనదైన మార్కుని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. ఇందులో భాగంగా ఆసియా, కామన్వెల్త్, టోక్యో (2020) ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లకు సిద్ధమయ్యే అథ్లెట్లకు ఆర్థిక సహాయం చేసేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేశారు.

ఇందులో భాగంగా టార్గెట్ ఒలింపిక్ పోడియం(టాప్) స్కీమ్ కింద ఎంపికైన 152 మంది ఆటగాళ్లకు ఖర్చుల కింద నెలకు రూ.50వేల చొప్పున ఇస్తామని క్రీడామంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ ప్రకటించారు. అయితే ఈ జాబితా టెన్నిస్ ప్లేయర్లు లియాండర్‌పేస్, సాకేత్ మైనేనిలకు షాకిచ్చింది.

Paes, Myneni dropped from Sports Ministry's allowance list

ఎందుకంటే ఈ టాప్ అథ్లెట్ల జాబితా నుంచి టెన్నిస్ ప్లేయర్లు లియాండర్‌పేస్, సాకేత్ మైనేని పేర్లను క్రీడాశాఖ తొలిగించింది. మొత్తం 152 మంది అథ్లెట్లను ఎంపిక చేయగా అందులో నుంచి వీరిని తొలిగించి.. యుకీ, రామ్‌కుమార్, బోపన్న, సుమిత్ నాగల్‌కు చోటు కల్పించింది.

Paes, Myneni dropped from Sports Ministry's allowance list

ఇక మహిళాల టెన్నిస్ సానియా, ప్రార్థనా తొంబ్రే, కర్మాన్‌కౌర్ ఉన్నారు. ఇటీవలే క్రీడాఅవార్డుల్లో సాకేత్ మైనేని ప్రతిష్టాత్మక అర్జున అవార్డుని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇది తుది జాబితా కాదని క్రీడాశాఖ ప్రతినిధి ఒకరు చెప్పడం విశేషం.

Story first published: Sunday, September 17, 2017, 11:56 [IST]
Other articles published on Sep 17, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి