డేవిస్ క‌ప్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన లియాండ‌ర్ పేస్

Posted By:
Paes creates history, keeps Indias Davis Cup hopes alive

హైదరాబాద్: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. డేవిస్‌ కప్‌లో అత్యధిక డబుల్స్‌ విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. చైనాలోని తియాంజిన్ వేదికగా జరుగుతోన్న డేవిస్ కప్‌ డబుల్స్ మ్యాచ్‌లో చైనాతో ఆసియా/ఓసియానియా గ్రూప్‌ టైలో పేస్‌ జోడీ ఘన విజయం సాధించింది.

డేవిస్‌ కప్‌ డబుల్స్‌లో పేస్‌కిది 43వ విజయం. పేస్ కంటే ముందు ఇరాన్‌కు చెందిన నికోలా పిట్రాంగిలీ అనే ప్లేయర్ డేవిస్ కప్ డబుల్స్‌లో 42 విజయాలు అందుకున్నాడు. ఆ రికార్డును ఇప్పడు లియాండర్ పేస్ బద్దలు కొట్టాడు. డేవిస్ కప్‌లో భాగంగా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో పేస్ జోడి ఈజీగా విజయం సాధించింది.

రోహన్‌ బోపన్న, లియాండర్ పేస్ జోడి చైనా జంట గాంగ్‌-జీ జాంగ్‌ జోడీని 5-7, 7-6(5), 7-6(3) తేడాతో ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. చైనా వేదికగా జరుగుతోన్న డేవిస్ కప్ టోర్నీలో భారత్ ఇంకా వెనుకంజలోనే ఉంది. 1-2 పాయింట్ల తేడాతో చైనా ముందుకు దూసుకెళ్తోంది.

శుక్రవారం చైనాతో జరిగిన రెండు సింగిల్స్‌ మ్యాచుల్లో పరాజయం పాలైంది. దీంతో ఈ టోర్నీలోశనివారం జరగాల్సిన రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత్ తప్పక విజయం సాధించాలి. ఒకవేళ భారత్‌ ఈ టైను చేజిక్కించుకోలేకపోతే ఐదేళ్లలో భారత్‌కు ఆసియా/ఓసియానియా గ్రూపు స్థాయిలో ఇదే తొలి ఓటమి అవుతుంది.

16 ఏళ్ల వయసులో 1990లో జీషాన్‌ అలీతో కలిసి లియాండర్‌ పేస్‌ మొట్ట మొదటిసారి డేవిస్‌కప్‌లో ఆడాడు. ప్రస్తుతం జీషాన్‌ అలీ డేవిస్ కప్‌లో పాల్గొంటన్న భారత టెన్నిస్ జట్టుకు కోచ్‌గా వ్యవహారిస్తున్నారు. తన టెన్నిస్ ప్రస్థానంలో మహేశ్ భూపతితో కలిసి లియాండర్ పేస్ అనేక విజయాలను సాధించాడు.

Story first published: Saturday, April 7, 2018, 12:53 [IST]
Other articles published on Apr 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి