న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'అనుకోకుండా జరిగింది.. ఆమెకు ఇబ్బంది కలిగించినందుకు మనసారా క్షమాపణలు'

Novak Djokovic says sorry after defaulting US Open match for hitting line umpire with ball

న్యూయార్క్‌: టాప్ సీడ్, సెర్బియన్‌ స్టార్‌ నోవాక్‌ జకోవిచ్‌‌ లైన్‌ జడ్జ్‌కు క్షమాపణ చెప్పాడు. ఆ ఘటన అనుకోకుండా జరిగిందని, లైన్‌ జడ్జ్‌కు ఇబ్బంది కలిగించినందుకు మనసారా క్షమాపణలు చెబుతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. జాకో యూఎస్‌ ఓపెన్‌ నుంచి డిఫాల్ట్‌ అయిన విషయం తెలిసిందే. టోర్నీ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన‌ జకోవిచ్..‌ ఆదివారం నాలుగో రౌండ్‌ సందర్భంగా అర్ధాంతరంగా నిష్క్రమించాడు.

ఆదివారం ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నొవాక్ జొకోవిచ్ తన ప్రత్యర్థి పాబ్లో కారెనో బస్టా చేతిలో మొదటి సెట్లో 6-5తో వెనుకబడిపోయాడు. ఛేంజ్‌ ఓవర్‌ కోసం జొకోవిచ్ పక్కకు వెళుతూ.. బంతిని వెనుకకు కొట్టాడు. అది వెళ్లి లైన్ జడ్జ్‌ గొంతుకు తాకడంతో నొప్పిని భరించలేక ఆమె కిందపడిపోయారు. టోర్నమెంట్ రిఫరీ సోరెన్ ఫ్రైమెల్‌తో సహా కోర్టులో అధికారులతో చర్చించిన చైర్ అంపైర్ అరేలీ టూర్టే.. జకోవిచ్‌ను డిఫాల్ట్‌గా ప్రకటించారు. ఉద్దేశపూర్వకంగా కొట్టకపోయినా.. నిబంధనల ప్రకారం గతంలో జరిగిన ఘటనలను పరిగణలోకి తీసుకొని టోర్నీ నుంచి తొలగించారు.

మ్యాచ్ అనంతర విలేకరుల సమావేశానికి నొవాక్ జొకోవిచ్‌ హాజరు కాలేదు. జరిగిన ఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. 'ఈ ఘటన నన్ను బాధకు గురిచేస్తోంది. లైన్‌ అంపైర్‌ను పరిశీలించాను. అదృష్టం కొద్దీ ఆమె బాగానే ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. ఇదంతా అనుకోకుండా జరిగింది. ఆమెకు ఇబ్బంది కలిగించినందుకు మనసారా క్షమాపణలు చెబుతున్నా. ఆమె వ్యక్తిగత సమాచారానికి భంగం కలగకూడదనే నేను పేరును వెల్లడించడంలేదు' అని జాకో పోస్ట్ చేశాడు.

'నన్ను టోర్నీ నుంచి తీసేయడం చాలా బాధగా ఉంది. నేను చేసింది తప్పే. ఇంటికి వెళ్లి దీన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ఈ ఘటన నాకో గుణపాఠం లాంటిది. కెరీర్‌లో ఆటగాడిగా ఎదిగేందుకు, మనిషిగా జీవించేందుకూ తోడ్పడుతుంది. ఈ ఘటనపై యూఎస్‌ ఓపెన్‌కూ క్షమాపణలు చెబుతున్నా. దీని వల్ల ఇబ్బందికి గురైన ప్రతీ ఒక్కర్నీ మన్నించమని కోరుతున్నా. ఈ సమయంలో నాకు అండగా నిలిచిన నా బృందం, కుటుంబం, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ధన్యవాదాలు' అని జకోవిచ్‌ భావోద్వేగం చెందాడు.

ఇదిలా ఉంటే.. నోవాక్ జకోవిచ్‌పై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాకో కోపంతోనే చేశాడని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం అనుకోకుండానే జరిగిందంటున్నారు. అనుకోకుండా అతడు ఓ బంతిని కొట్టడంతోనే అది నేరుగా వెళ్లి లైన్‌ అంపైర్‌కు తగిలినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఏదేమైనా ఈ ఘటనతో నాలుగో సారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలవాలన్న అతడి కోరిక వృథా అయింది.

ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే ఆడడానికి కారణం ఎంఎస్ ధోనీనే!!ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే ఆడడానికి కారణం ఎంఎస్ ధోనీనే!!

Story first published: Monday, September 7, 2020, 17:39 [IST]
Other articles published on Sep 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X