న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2021: మూడో రౌండ్లో బార్టీ, జకోవిచ్.. మరోసారి వివాదాస్పదమైన సిట్సిపాస్‌ టాయ్‌లెట్‌ బ్రేక్‌!!

Novak Djokovic, Ash Barty and Emma Raducanu advances to US Open 2021 3rd round

న్యూయార్క్‌: ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌ 2021 టెన్నిస్‌ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్‌వన్‌, ఆస్ట్రేలియా ప్లేయర్ యాష్లే బార్టీ జోరు కనబరుస్తోంది. గురువారం జరిగిన మహిళల రెండో రౌండ్‌లో బార్టీ 6-1, 7-5తో క్లారా టౌసన్‌ (డెన్మార్క్‌)పై వరుస సెట్లలో గెలిచి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్‌లో బార్టీ 11 ఏస్‌లు కొట్టి రెండు డబుల్‌ ఫాల్ట్‌లను చేయగా.. క్లారా రెండు ఏస్‌లను సంధించి మూడు డబుల్‌ ఫాల్ట్‌లను చేసింది. ఆదివారం మ్యాచులో షెల్బీ రోజర్స్ లేదా సోరానా సిర్‌స్టెయాతో బార్టీ తలపడనుంది. తుఫాను కారణంగా యూఎస్‌ ఓపెన్‌లోని కొన్ని మ్యాచులు ఆసల్యంగా మొదలయ్యాయి.

బ్రిటిష్ టీనేజర్ ఎమ్మా రడుకను యూఎస్‌ ఓపెన్‌లో మరో అద్భుత విజయం సొంతం చేసుకుంది. చైనాకు చెందిన జాంగ్ షువాయ్పై 6-2 6-4తో గెలిచి మూడో రౌండ్‌కు చేరుకుంది. ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత బార్బొరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-3, 6-1తో క్రిస్టినా మెకాలే (అమెరికా)పై గెలుపొందింది. రెండో సీడ్‌ అరీనా సబలెంకా (బెలారస్‌) 6-3, 6-1తో తామర జిదాన్‌సెక్‌ (స్లొవేనియా)పై, 2017 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ స్టీఫెన్స్‌ 6-4, 6-2తో కోకో గాఫ్‌ (అమెరికా)పై గెలుపొందింది. ఇక మహిళల సింగిల్స్‌లో అమెరికా క్రీడాకారిణి స్లోన్‌ స్టీఫెన్స్‌ 6-4, 6-2తో తన దేశానికే చెందిన కోకో గాఫ్‌ను చిత్తు చేసి నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఆమె తదుపరి మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ నవోమి ఒసాకాతో తలపడనుంది.

IND vs ENG: అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేక మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డు బద్దలు!!IND vs ENG: అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేక మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డు బద్దలు!!

గ్రీస్‌ టెన్నిస్‌ స్టార్‌, ప్రపంచ మూడో ర్యాంకర్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ యూఎస్‌ ఓపెన్‌ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సిట్సిపాస్‌ 6-3, 6-4, 6-7 (4/7), 6-0 తేడాతో అడ్రైన్‌ మన్నరినో(ఫ్రాన్స్‌)పై గెలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లోనూ సిట్సిపాస్‌ టాయ్‌లెట్‌ బ్రేక్‌ మరోసారి వివాదాస్పదమైంది. మూడు, నాలుగు సెట్ల మధ్య అతడు ఎనిమిది నిమిషాల పాటు విరామం తీసుకున్నాడు. యూఎస్‌ ఓపెన్‌ మొదటి మ్యాచ్‌లో కూడా అతడు ఇదే విధంగా చేశాడు. దీంతో అతడి విరామం ప్రస్తుతం చర్చల్లో ఉంది.

యూఎస్‌ ఓపెన్‌ రెండు సార్లు రన్నరప్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా) మూడో రౌండ్‌లో ప్రవేశించారు. రెండో రౌండ్‌లో సిట్సిపాస్‌ 3-6, 6-4, 7-6 (7/4), 6-0తో అడ్రియాన్‌ మనారినో (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. మ్యాచ్‌లో సిట్సిపాస్‌ ఏకంగా 27 ఏస్‌లు సంధించాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్, నోవాక్ జకోవిచ్ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. జ్వెరెవ్ 6-1, 6-0 6-3 తేడాతో స్పెయిన్ ఆల్బర్ట్ రామోస్‌పై విజయం సాధించగా.. జకోవివ్ 6-2, 6-3, 6-2తో టాలన్ గ్రీక్ రైల్వేపై గెలుపొందాడు.

Story first published: Friday, September 3, 2021, 7:45 [IST]
Other articles published on Sep 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X