న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2020: క్వీన్ నవోమి ఒసాక.. ఫైనల్లో అజరెంకా ఓటమి!

Naomi Osaka wins second US Open title

న్యూయార్క్‌: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2020 టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా జపాన్‌ క్రీడాకారిణి నవోమి ఒసాక నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఫైనల్లో నాల్గోసీడ్ ఒసాక 1-6, 6-3, 6-3 తేడాతో అజరెంకాను ఓడించి కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గంటా 53 నిమిషాల పాటు జరిగిన ఈ టైటిల్ ఫైట్‌లో ఒసాకా తొలి సెట్ కోల్పోయినప్పటికీ మిగతా రెండు సెట్లలో ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా బరిలో నిలిచి టైటిల్‌ను సాధించింది.

ఆ మ్యాచ్ రిపీట్..

ఆ మ్యాచ్ రిపీట్..

మ్యాచ్‌ మొత్తంలో6 ఏస్‌లు సంధించిన జపాన్ ప్టార్.. 2 డబుల్‌ ఫాల్ట్‌లతోపాటు 8 బ్రేక్ పాంట్స్ సంపాదించింది. 13 అనవసర తప్పిదాలు చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో అజరెంకా ఓడిన తీరు ఆమె ఆడిన సెమీఫైనల్‌ను గుర్తు చేసింది. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌తో జరిగిన సెమీస్‌లో అజరెంకా ఇలానే గెలిచి ఫైనల్‌కు చేరింది. తొలి సెట్‌ను 1-6 తేడాతో కోల్పోయిన అజరెంకా.. మిగతా రెండు సెట్లను 6-3, 6-3 తేడాతో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. ఇప్పుడు అదే అనుభవం అజరెంకాకు ఎదురుకావడం గమనార్హం.

 రెండో టైటిల్..

రెండో టైటిల్..

ఒసాకకు ఇది రెండో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ కాగా ఓవరాల్‌గా మూడో గ్రాండ్ స్లామ్ ట్రోఫీ. 2018లో యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఒసాక.. ఏడాది వ్యత్యాసంలోనే మరో టైటిల్‌ను సొంతం చేసుకుంది. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఆమె గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ద్వారా జాతి వివక్ష, సామాజిక న్యాయంపై ప్రజా చైతన్యం కోసం ఒసాక తనవంతు కృషి చేసిన విషయం తెలిసిందే. పోలీసుల కాల్పులో మరణించిన నల్లజాతీయుడి పేరున్న మాస్క్‌లను మ్యాచ్‌ల సందర్భంగా నవోమి ధరిస్తున్న విషయం తెలిసిందే.

జాతి వివక్షపై..

జాతి వివక్షపై..

ప్రతీ మ్యాచ్‌కు ముందు వివక్ష బలైన బాధితుల పేర్లతో ఉన్న మాస్క్‌లను ఆమె ధరించింది. తొలి రౌండ్‌లో బ్రియానా టేలర్, సెకండ్ రౌండ్‌లో ఎలిజా మెక్‌క్లెయిన్, మూడో రౌండ్‌లో అహ్‌మౌద్ ఆర్బెరీ, ట్రేవన్ మార్టిన్, క్వార్టర్స్‌లో జార్జ్ ఫ్లాయిడ్, సెమీఫైనల్లో ఫిలాండో క్యాస్టిల్, ఫైనల్లో టమిర్ రైస్ పేర్లతో కూడిన మాస్క్‌లను ధరించింది. బాధితుల కుటుంబాలు ఒసాకాకు వీడియో సందేశాన్ని పంపాయి. మృతులకు ఆమె ఇస్తున్న గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాయి. ఆ సందేశం చూసిన ఒసాక తీవ్ర భావోద్వేగానికి గురైంది. వర్ణ వివక్షపై అవగాహన కోసం తాను చేస్తున్న ప్రయత్నం ఇదని ఆమె చెప్పింది.

French Open Quarter-Final : Marco Cecchinato Stuns Novak Djokovic
ఆ జంటకు ‘డబుల్స్‌'టైటిల్..

ఆ జంటకు ‘డబుల్స్‌'టైటిల్..

మహిళల డబుల్స్‌ విభాగంలో అన్‌సీడెడ్‌ జోడీ లౌరా సిగెముండ్‌ (జర్మనీ)-వెరా జ్వొనరేవా (రష్యా) విజేతగా నిలిచింది. 80 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ఈ జంట 6-4, 6-4తో మూడో సీడ్‌ నికోల్‌ మెలికార్‌ (అమెరికా)-యిఫాన్‌ షు (చైనా) జోడీపై విజయం సాధించింది. విజేత సిగెముండ్‌-జ్వొనరేవా ద్వయంకు 4,00,000 డాలర్లు (రూ. 2 కోట్ల 94 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Story first published: Sunday, September 13, 2020, 10:32 [IST]
Other articles published on Sep 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X