French Open 2021: సకారి మాయ.. స్వెటెక్‌కు షాక్! సెమీస్‌లో నలుగురూ కొత్తవారే! నాదల్‌ దూకుడు!

పారిస్: గ్రీస్‌ క్రీడాకారిణి మారియా సకారి మాయ చేసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2021 మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇగా స్వెటెక్‌కు షాకిచ్చి.. సెమీస్‌లోకి దూసుకొచ్చింది. ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఆ ఘనత సాధించిన తొలి గ్రీకు అమ్మాయిగా సకారి చరిత్ర సృష్టించింది. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో 17వ సీడ్‌ సకారి 6-4, 6-4 తేడాతో 8వ సీడ్‌ ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌)ను వరుస సెట్లలో చిత్తుచేసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో వరుసగా రెండు సార్లు విజేతగా నిలిచి.. గత పదమూడేళ్లుగా ఎవరికీ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుందామని ఆశ పడ్డ స్వైటెక్‌కు నిరాశే ఎదురైంది.

సంజ‌య్ మంజ్రేకర్ ఛాట్ లీక్.. మరోసారి ర‌వీంద్ర జ‌డేజాపై సంచలన వ్యాఖ్యలు! ఈసారి ఏమన్నాడంటే?

అమెరికా యువ సంచలనం కోకో గాఫ్‌తో క్వార్టర్స్‌ పోరులో మొదట తడబడి.. ఆ తర్వాత గొప్ప పోరాటంతో నిలబడ్డ అన్‌సీడెడ్‌ బార్బోరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) సెమీస్‌లోకి అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభం నుంచి అనూహ్య ప్రదర్శనతో సత్తాచాటుతున్న క్రెజికోవా క్వార్టర్స్‌లో 7-6 (8-6), 6-3తో గాఫ్‌ను ఓడించింది. పవర్‌ గేమ్‌తో చెలరేగిన గాఫ్‌.. తొలి సెట్లో ఓ దశలో 3-0తో నిలిచింది. అయితే నాలుగో గేమ్‌లో ఆమె ఓ డబుల్‌ ఫాల్ట్‌ చేయడంతో అవకాశం అందుకున్న క్రెజికోవా వరుసగా మూడు గేమ్‌లు గెలిచి స్కోరు సమం చేసింది. ఆపై మరింత రెచ్చిపోయిన క్రెజికోవా సెట్‌ను టైబ్రేకర్‌కు మళ్లించింది. అక్కడ దూకుడు ప్రదర్శించి విజయాన్ని అందుకుంది. ఇక రెండో సెట్లో ఆమెకు ఎదురు లేకుండా పోయింది. వరుసగా అయిదు గేమ్‌లు నెగ్గి గెలుపు ఖాయం చేసుకుంది.

ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2021 మహిళల సింగిల్స్‌లో ఈసారి స్టార్‌ ప్లేయర్లు ఒకరివెంట ఒకరు నిష్క్రమించారు. బార్టీ, సబెలెంక, సోఫియా, స్వితోలినా, సెరెనా ఇలా ఒక్కొక్కరు ఓడిపోవడంతో ఈసారి సెమీస్‌లో నలుగురూ కొత్తవాళ్లే చేరుకున్నారు. తమారా జిదాన్‌సెక్‌ , పవ్లుచెన్‌కోవా, సకారి, క్రెజ్సికోవా ఈసారి సెమీస్‌లో చోటు దక్కించుకున్నారు. గ్రాండ్‌స్లామ్‌ మహిళల సెమీస్‌లో అందరూ కొత్తవారు తలపడడం టెన్నిస్‌ చరిత్రలో ఇది రెండోసారి.

13సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత, స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌ సెమీస్‌లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ రఫా 6-3, 4-6, 6-4, 6-0తో పదో సీడ్‌ డిగో స్వార్జ్‌మన్‌ (అర్జెంటీనా)ను అలవోకగా ఓడించాడు. ఈ ఏడాది తొలిసారి సెట్‌ కోల్పోయినా నాదల్‌ తనదైన శైలిలో రఫ్పాడించాడు. రెండో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)కు ఐదో సీడ్‌ స్పెఫనోస్‌ సిట్సిపాస్‌ చేతిలో నిరాశ ఎదురైంది. క్వార్టర్స్‌లో సిట్సిపాస్‌ (స్విట్జర్లాండ్‌) 6-3, 7-6 (7/3), 7-5తో మెద్వెదెవ్‌ను వరుస సెట్లలో చిత్తుచేశాడు. సెమీస్‌లో ఆరో సీడ్‌ జ్వెరెవ్‌ను సిట్సిపాస్‌ ఢీకొట్టనున్నాడు. మరో క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ తొమ్మిదో సీడ్‌ బెరెటినీతో తలపడనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్‌ నాదల్‌కు ఎదురుపడనున్నాడు. దీంతో సెమీస్‌లో రఫా-జొకో సూపర్‌ ఫైట్‌ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, June 10, 2021, 7:45 [IST]
Other articles published on Jun 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X