న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముచ్చటగా మూడోసారి: యుఎస్ ఓపెన్ విజేతగా నొవాక్ జొకోవిచ్

By Nageshwara Rao
Magnificent Djokovic equals Sampras slam haul with US Open glory

హైదరాబాద్: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ మరో గ్రాండ్ స్లామ్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన యుఎస్ ఓపెన్ ఫైనల్లో అర్జెంటీనాకు చెందిన జువాన్ మార్టిన్ డెల్‌పొట్రోపై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. దీంతో ముచ్చటగా మూడోసారి యుఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

యుఎస్ ఓపెన్‌ ఫైనల్: డెల్ పోత్రో Vs జొకొవిచ్, విజయం ఎవరిని వరిస్తుందో?యుఎస్ ఓపెన్‌ ఫైనల్: డెల్ పోత్రో Vs జొకొవిచ్, విజయం ఎవరిని వరిస్తుందో?

దీంతో అమెరికన్ టెన్నిస్ దిగ్గజం పీట్ సంప్రాస్ రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. 2017, ఈ ఏడాది ప్రథమార్థ వరకు వ్యక్తిగత సమస్యలు, గాయాలతో సతమతమై జొకోవిచ్.. వాటిని అధిగమించి 2018 వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్నాడు. యుఎస్ ఓపెన్‌లోనూ అదే జోరును కొనసాగించి టైటిల్ గెలిచాడు.

యూఎస్ ఓపెన్ 2007, 2012లో డెల్‌పోట్రోను వరుస సెట్లలో ఓడించిన జొకోవిచ్, 2018లోనూ వాటిని పునరావృతం చేశాడు. 2009లో యూఎస్ ఓపెన్ గెలిచి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకున్న డెల్‌పోట్రో, తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరాడు. కానీ, జొకోవిచ్ దూకుడుకు ఎదురు నిలువలేక చేతులెత్తేశాడు.

ఆదివారం అర్థరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌లో ఆరో సీడ్‌ నొవాక్ జొకోవిచ్‌ 6-3, 7-6,(7/4), 6-3తో అర్జెంటీనా డెల్‌పొట్రోపై అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జొకోవిచ్ ఫైనల్లో తన ప్రత్యర్ధికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఫైనల్లో తొలి సెట్‌ను 6-3తో కోల్పోయిన డెల్ పోట్రో అనూహ్యంగా పుంజుకున్నాడు.

దీంతో రెండో సెట్‌ నువ్వానేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగింది. అయితే జొకోవిచ్ అనుభవం ముందు డెల్ పోట్రో నిలువలేకపోయాడు. ఇక, మూడో సెట్‌లోనూ జొకోవిచ్‌ కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. దీంతో మూడో సెట్‌ కూడా గెలిచి తన కెరీర్‌లో 14వ గ్రాండ్‌స్లామ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

యూఎస్ ఒపెన్‌లో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన నొవాక్, టైటిల్ గెలిచే క్రమంలో కేవలం రెండు సెట్లను మాత్రమే ప్రత్యర్థులకు కోల్పోయాడు. దీంతో అంతర్జాతీయ టెన్నిస్‌లో 14 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన పీట్‌ సంప్రాస్‌ సరసన చేరాడు. విపరీతమైన వేడి, ఉక్కుపోతను తట్టుకుని జోకోవిచ్, ఈ సీజన్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ను గెలవడం విశేషం.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఆర్థర్ అషే స్టేడియంలో అమెరికన్ స్టార్ పీట్ సంప్రాస్ తన 14 వ గ్రాండ్‌స్లామ్‌ను అందుకోగా, జొకోవిచ్ కూడా అదే మైదానంలో ఆయన రికార్డును సమం చేయడం. ఈ జాబితాలో స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌(20 టైటిల్స్‌), స్పెయిన్ బుల్ రఫెల్‌ నాదల్‌(17 టైటిల్స్‌) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. గ్రాండ్‌స్లామ్స్‌లో 23 సార్లు ఫైనల్ చేరిన జకోవిచ్ 14 సార్లు టైటిల్స్ విజేతగా నిలిచాడు.

Story first published: Monday, September 10, 2018, 12:44 [IST]
Other articles published on Sep 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X