న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆటకన్నా ముందు నా ముగ్గురు పిల్లల బాగోగులే ముఖ్యం: క్లియ్‌స్టర్స్‌

Kids first, tournaments second, says comeback queen Kim Clijsters

హైదరాబాద్: మాజీ వరల్డ్ నంబర్ వన్, నాలుగు మేజర్ ఛాంపియన్ టైటిళ్లు నెగ్గిన కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి టెన్నిస్‌ రాకెట్‌ చేత పట్టనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఎంపిక చేసుకున్న టోర్నమెంట్స్‌లో మాత్రమే ఆడాలనుకుంటోంది. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది.

ఆటకన్నా ముందు తన ముగ్గురు పిల్లల బాగోగులే ముఖ్యమని కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ స్పష్టం చేసింది. "ఈసారి నా టెన్నిస్‌ ప్రయాణం కఠినంగానే సాగనుంది. నా పిల్లలు నిరంతరం ప్రయాణించడం కష్టం కాబట్టి ఎక్కువ టోర్నీల్లో ఆడలేను. వారి స్కూల్‌, పరీక్షలను దృష్టిలో ఉంచుకుని చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నా రీఎంట్రీ వారి చదువుపై ప్రభావం చూపకూడదు" అని పేర్కొంది.

39 బంతులు.. 1 పరుగు.. అభినందనలతో దద్దరిల్లిన స్టేడియం(వీడియో)!!39 బంతులు.. 1 పరుగు.. అభినందనలతో దద్దరిల్లిన స్టేడియం(వీడియో)!!

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌కు మైదానంలోకి రావాలనుకున్న 36 ఏళ్ల క్లియ్‌స్టర్స్‌కు మోకాలి గాయం అడ్డంకిగా మారింది. అయితే, గాయం నుంచి కోలుకుని మార్చిలో మెక్సికో వేదికగా మాంట్రెరీ టోర్నీ ద్వారా తాను మళ్లీ మైదానంలోకి అడుగుపెడతానని తెలిపింది. దీంతో క్లియ్‌స్టర్స్‌ వచ్చే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి.

బిడ్డకు జన్మనివ్వడం కోసం తొలిసారి 2007లో రిటైరైన క్లియ్‌స్టర్స్‌ ఆ తర్వాత 2009లో పునరాగమనం చేసి రెండేళ్ల పాటు ఆటలో కొనసాగింది. 2011లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచాక రెండోసారి రిటైర్మెంట్‌ తీసుకుంది. 36 ఏళ్ల క్లియ్‌స్టర్స్ వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో తిరిగి పోటీకి రావాలని అనుకుంది. అయితే, ఆమె మోకాలి గాయం అందుకు అడ్డుపడింది.

ట్రయల్స్‌ను వాయిదా వేయలేం: రెజ్లర్ సుశీల్ కుమార్‌కు షాకిచ్చిన డబ్ల్యూఎఫ్‌ఐట్రయల్స్‌ను వాయిదా వేయలేం: రెజ్లర్ సుశీల్ కుమార్‌కు షాకిచ్చిన డబ్ల్యూఎఫ్‌ఐ

దీంతో వచ్చే ఏడాది మోంటెర్రే (మార్చి 2-8) టోర్నీతో పునరాగమనం చేయనుంది. 2003, 2005లో క్లియ్‌స్టర్స్ ఇండియా వెల్స్ టోర్నీ టైటిళ్లను గెలిచింది. ఆమె కెరీర్‌లో మొత్తం 41 టైటిళ్లు ఉన్నాయి. ఇందులో మూడు యుఎస్ ఓపెన్(2005, 2009 and 2010), ఒక ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా ఉంది. 1997లో ప్రొపెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారిని క్లియ్‌స్టర్స్ 2003లో నెంబర్ వన్ ర్యాంకుని కైవసం చేసుకుంది.

Story first published: Friday, January 3, 2020, 14:15 [IST]
Other articles published on Jan 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X