న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్యా, బెలారస్ టెన్నిస్ ప్లేయర్లపై నిషేధం.. వింబుల్డన్‌కు స్టార్లు దూరం

key decision taken. Russian And Belarusian Players get ban in wimbledon

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగి దాదాపు రెండు నెలలు గడిచింది. ఇంకా రష్యా ఉక్రెయిన్లో తన దాడులను కొనసాగిస్తోంది. నాటోలో ఉక్రెయిన్ చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రష్యా.. దాన్ని విరమించుకోవాలంటూ ఉక్రెయిన్‌ను ఒత్తిడి చేసింది. అగ్రరాజ్యం సహా పలు యూరప్ దేశాలున్న నాటో కూటమిలో చేరితే తమకు బలం చేకూరుతుందని భావించిన ఉక్రెయిన్ రష్యా చేస్తున్న ప్రతిపాదనలు తోసిపుచ్చడంతో రష్యా కయ్యానికి కాలుదువ్వింది.

దీంతో ఉక్రెయిన్‌పై హఠాత్తుగా ఫిబ్రవరి 20వ తేదీన రష్యా యుద్ధాన్ని ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడాన్ని అమెరికా, బ్రిటన్ సహా చాలా యూరప్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తన పంతం నెగ్గేదాకా తగ్గేదేలే అంటూ సైన్యాన్ని ఉసిగొల్పుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో రష్యాపై అమెరికా సహా యూరప్ దేశాలు తీవ్ర ఆంక్షలు కొనసాగించాయి. రష్యాపై ఇప్పటికే ఎన్నో వ్యాపార, వాణిజ్య, క్రీడా, ఆర్థిక పర ఆంక్షలను విధించాయి. తాజాగా వింబుల్డన్ 2022టోర్నమెంట్ నుండి రష్యన్, బెలారస్ దేశ ఆటగాళ్లపై నిషేధం వేటు పడింది.

టెన్నిస్‌లో వింబుల్డన్‌ టోర్నీకి చాలా పేరుంది. ఈ టోర్నీని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ AELTC నిర్వహిస్తుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిరసనగా.. AELTC ఓ ప్రకటన విడుదల చేస్తూ.. తమకు సాధ్యమైన రీతిలో రష్యా ప్రభావాన్ని పరితం చేయడానికి రష్యన్, బెలారస్ ఆటగాళ్లపై నిషేధం విధిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అన్యాయమైన సైనిక దురాక్రమణ పరిస్థితులలో రష్యన్ లేదా బెలారసియన్ ఆటగాళ్ల వల్ల రష్యాకు మంచి పేరు రావడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.

దీంతో టెన్నిస్ స్టార్లు అయిన పురుషుల టెన్నిస్ ప్రపంచ రెండో ర్యాంకర్ రష్యన్ ప్లేయర్ డేనియల్ మెద్వెదేవ్, మహిళల టెన్నిస్ ప్రపంచ నాలుగో ర్యాంకర్ బెలారస్ ప్లేయర్ అరీనా సబలెంకా నిషేధానికి గురి కానున్నారు. అలాగే రష్యా ప్లేయర్లలో ATPర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న ఆండ్రీ రుబ్లెవ్, 26వ స్థానంలో ఉన్న కరెన్ ఖచనోవ్ సైతం వింబుల్డన్ టోర్నీకి దూరం కానున్నారు. అలాగే మహిళల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ అయిన రష్యన్ ప్లేయర్ అనస్తాసియా పావ్లియుచెంకోవా, బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకా ఈ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి దూరం కానున్నారు.

వింబుల్డన్ టోర్నీ టెన్నిస్ క్రీడలోని నాలుగు గ్రాండ్ స్లామ్ ఈవెంట్లలో అత్యంత ప్రాముఖ్యం ఉన్న టోర్నీ. ఈ ఏడాది జూన్ 27 నుండి జూలై 10వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఇకపోతే రష్యా మరియు బెలారస్ ప్లేయర్లు మేలో ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం పోటీపడనున్నారు.

Story first published: Wednesday, April 20, 2022, 22:22 [IST]
Other articles published on Apr 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X