న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇటాలియన్ ఓపెన్: సెమీ‌ఫైనల్లో షరపోవా Vs హలెప్

By Nageshwara Rao
Italian Open: Maria Sharapova to play Simon Halep in semi-finals

హైదరాబాద్: రష్యా టెన్నిస్‌ స్టార్ మరియా షరపోవా సత్తా చాటింది. పునరాగమనంలో తొలిసారి ఓ టోర్నమెంట్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ రోమ్ వేదికగా జరుగుతున్న ఇటాలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరి టైటిల్‌ దిశగా దూసుకొచ్చింది.

శుక్రవారం జరిగిన హోరాహోరీ క్వార్టర్‌ఫైనల్లో 31 ఏళ్ల షరపోవా 6-7(6/8), 6-4, 7-5తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత జెలెనా వోస్టాపెంకో (జర్మనీ)పై విజయం సాధించింది. మూడు గంటలపాటు సాగిన ఈ ఉత్కంఠ పోరులో షరపోవా రెండుసార్లు మ్యాచ్‌ పాయింట్‌ను చేజార్చుకొని నెగ్గింది.

 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో షరపోవాకు సీడింగ్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో షరపోవాకు సీడింగ్‌

కాగా, తాజా విజయంతో షరపోవా టాప్‌-32 ర్యాంక్‌లోపు చోటు దక్కించుకోనుంది. దీని ఫలితంగా రానున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌లో షరపోవాకు సీడింగ్‌ దక్కనుంది. శనివారం జరిగే సెమీ ఫైనల్లో మరియా షరపోవా వరల్డ్ నంబర్ వన్ సిమోనా హలెప్‌తో తలపడనుంది.

శుక్రవారం జరిగిన రెండోరౌండ్ మ్యాచ్‌లో పక్కటెముల

శుక్రవారం జరిగిన రెండోరౌండ్ మ్యాచ్‌లో పక్కటెముల

గాయంతో అమెరికాకు చెందిన మాడిసన్ కైస్ తప్పుకోవడంతో హలెప్ ముందంజ వేసింది. మూడుసెట్లపాటు సాగిన రెండోరౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ టూ, డెన్మార్క్ అమ్మాయి కరోలినా వోజ్నియాకి ఇటాలియన్ ఓపెన్ క్వార్టర్స్ చేరుకుంది. లాత్వియాకు చెందిన అనస్టాసిజా సెవాస్‌స్టోవాను 6-2,5-7,6-3 స్కోరుతో కాస్త కష్టపడి విజయం సాధించింది. తద్వారా 2011 తర్వాత తొలిసారిగా ఈ టోర్నీలో తుది ఎనిమిది జాబితా చేరింది. క్వార్టర్స్‌లో ఎస్తోనియాకు చెందిన అన్నెట్ కొంటావిట్‌తో తలపడనుంది.

1999లో టోర్నీ విజేతగా వీనస్ విలియమ్స్

1999లో టోర్నీ విజేతగా వీనస్ విలియమ్స్

రెండోరౌండ్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన మాజీ ప్రపంచ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్‌పై 6-2,7-6(7-3)స్కోరుతో కొంటావిట్ విజయం సాధించింది. 1999లో వీనస్ విలియమ్స్ ఈ టోర్నీ చాంపియన్‌గా నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా మళ్లీ ఇంతవరకు వీనస్ ఇటాలియన్ సాధించడంలో విఫలం కావడం విశేషం.

 సెమీ ఫైనల్‌‌కు చేరిన రఫెల్ నాదల్

సెమీ ఫైనల్‌‌కు చేరిన రఫెల్ నాదల్

మరోవైపు నాలుగో ర్యాంకర్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 6-4, 6-4తో మాజీ నంబర్‌వన్‌ కెర్బర్‌ (జర్మనీ)ను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇక, పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్‌ స్టార్‌ రఫెల్ నాదల్ సెమీఫైనల్‌ చేరాడు. పురుషుల క్వార్టర్స్‌లో స్థానిక ఇటలీ ఆటగాడు ఫాబియో ఫోగనినిపై 4-6, 6-1, 6-2 స్కోరుతో విజయం సాధించి క్లే కోర్టులో ఎదురులేదని నిరూపించుకున్నాడు. తొలిసెట్‌లో 4-6తో ఓటమితో ఒక్కసారిగా జూలు విదిల్చాడు. వరుసగా రెండుసెట్లను తనదైన స్టైల్‌లో ముగించి సగర్వంగా సెమీస్ చేరుకున్నాడు.

Story first published: Saturday, May 19, 2018, 11:40 [IST]
Other articles published on May 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X