న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలి సెట్‌లో ఫెద‌ర‌ర్‌ను ఓడించిన ఏకైక భారత ఆటగాడు ఇతడే!!

Indian Player Sumit Nagal Takes A Set Off Federer In Spirited Show At US Open

న్యూయార్క్‌: 20 సార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెద‌ర‌ర్‌ను భారత టెన్నిస్ ప్లేయ‌ర్ సుమిత్ నాగ‌ల్ కాసేపు వ‌ణికించాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఆడుతున్న 22 ఏళ్ల హరియాణా ఆటగాడు సుమిత్ యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌ తొలి సెట్‌లో ఫెద‌ర‌ర్‌కు ముచ్చెమటలు పట్టించాడు. సుమిత్ అద్భుత ఆటతో 6-4 తేడాతో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే అనంతరం వరుస సెట్‌లలో ఫెద‌ర‌ర్‌ పుంజుకోవడంతో సుమిత్ ఓటమిని చవిచూశాడు. ఫెద‌ర‌ర్‌ 4-6, 6-1, 6-2, 6-4 తేడాతో సుమిత్‌పై విజయం సాధించి యూఎస్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు.

<strong>ఓవర్ త్రో.. వికెట్లను బదులు బౌలర్‌ని కొట్టిన కీపర్‌ (వీడియో)</strong>ఓవర్ త్రో.. వికెట్లను బదులు బౌలర్‌ని కొట్టిన కీపర్‌ (వీడియో)

వింబుల్డ‌న్ జూనియ‌ర్ డ‌బుల్స్‌లో చాంపియ‌న్ అయిన సుమిత్ నాగ‌ల్ ఈ టోర్నీ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. తొలి సెట్‌ను కోల్పోయిన త‌ర్వాత ఫెద‌ర‌ర్‌ త‌న విశ్వరూపం ప్ర‌ద‌ర్శించాడు. క్లాస్ ఆట‌తో సుమిత్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టాడు. రెండ‌వ‌, మూడ‌వ సెట్‌ను ఫెద‌ర‌ర్ సునాయాసంగా గెలిచాడు. అయితే నాలుగ‌వ సెట్‌లో సుమిత్‌ అద్భుతంగా పోరాడాడు. బ్రేక్ పాయింట్‌కు అవ‌కాశం ఉన్నా.. సుమిత్‌ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. అనుభవంతో చివ‌ర‌కు ఫెద‌ర‌ర్ 6-4 తేడాతో నాలుగ‌వ సెట్‌ను గెలుచున్నాడు. దీంతో ఫెద‌ర‌ర్‌ రెండవ రౌండ్లోకి ప్ర‌వేశించాడు.

వరల్డ్‌ 190వ నంబర్‌ ఆటగాడైన సుమిత్‌.. మూడో సీడ్‌ ఫెదరర్‌కు తొలి షాక్‌ ఇవ్వడం విశేషం. గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌ డ్రాలో గత 20 ఏళ్లలో ఓ సెట్‌ గెలుచుకున్న నాలుగో భారత ఆటగాడిగా సుమిత్‌ రికార్డుల్లో నిలిచాడు. ఫెద‌ర‌ర్ లాంటి స్టార్ ఆట‌గాడిపై భార‌తీయ టెన్నిస్ ప్లేయ‌ర్ ఓ సెట్ గెల‌వ‌డం గొప్ప విషయం. తొలి సెట్‌లో ఫెద‌ర‌ర్‌కు షాక్ ఇచ్చిన తీరుకు టెన్నిస్ పండితులు సుమిత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సుమిత్‌ ఓడిపోయినప్పటికీ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు అని అంటున్నారు.

Story first published: Tuesday, August 27, 2019, 14:17 [IST]
Other articles published on Aug 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X