కరోనా వైరస్ ఎఫెక్ట్: చైనా నుంచి ఫెడ్ కప్ మ్యాచ్‌లు తరలింపు!

హైదరాబాద్: ఫెడ్ కప్ మ్యాచ్‌లపై కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా చైనాలో జరగాల్సిన ఫెడ్‌కప్ మ్యాచ్‌లను కజకిస్థాన్‌కు తరలించామని అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) ఆదివారం ప్రకటించింది. ఈ విషయాన్ని అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) సెక్రటరీ జనరల్ హిరన్మయ్ ఛటర్జీ ధ్రవీకరించారు.
ఫిబ్రవరి 4 నుంచి చైనాలోని డాంగువాన్‌లో జరగాల్సిన ఫెడ్‌కప్ మ్యాచ్‌లను వైరస్ కారణంగా వేరే దేశానికి మార్చాలని ఏఐటీఏ ఇదివరకే ఐటీఎఫ్‌కు లేఖ రాసింది. ఈ లేఖ నేపథ్యంలో ఫెడ్ కప్ మ్యాచ్‌లను చైనా నుంచి కజకిస్థాన్‌కు తరలిస్తూ ఐటీఎఫ్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారత టెన్నిస్ ప్లేయర్లు కజకిస్థాన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
కాగా, భారత స్టార్ ప్లేయర్ సానియా మిర్జా ఈ మ్యాచ్‌లకు వెళ్లడంపై సందిగ్థత నెలకొంది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మహిళల డబుల్స్ తరఫున బరిలోకి దిగిన సానియా కాలి గాయంతో తొలి రౌండ్‌లోనే అర్ధాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. సానియా ఇంకా పూర్తిగా కోలుకోలేదని, త్వరలోనే గాయాన్ని పరీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె తండ్రి ఇమ్రాన్ అన్నారు.
ఇదిలా ఉంటే, తాజా పరిస్థితులపై సానియాకు లేఖ రాశామని ఛటర్జీ పేర్కొన్నారు. ఫెడ్‌కప్ పోటీల్లో పాల్గొంటోనే సానియా మిర్జాకు టోక్యో ఒలింపిక్స్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు మహిళల ఒలింపిక్స్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్‌ను సైతం చైనా నుంచి సిడ్నీకి తరలించినట్లు ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ వెల్లడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications