న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సానియా రెండో ఇన్నింగ్స్‌.. ఇక సాధించేవన్నీ బోనస్‌లే

I will not prove any thing, results in second innings will be bonus says Sania Mirza

న్యూఢిల్లీ: భారత మహిళా టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా త్వరలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించనుంది. ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన కారణంగా రెండేళ్లుగా విరామం తీసుకున్న సానియా.. వచ్చే జనవరిలో మళ్లీ కోర్టులో అడుగుపెట్టే అవకాశముంది. ఇప్పటికే ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకుతో సహా ఎన్నో ఘనతలు సాధించిన సానియా.. రెండో ఇన్నింగ్స్‌లో కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు, ఇక సాధించేవన్నీ బోనస్‌లే అని పేర్కొంది.

యాషెస్‌ సిరీస్.. విరాట్ కోహ్లీని అధిగమించిన స్టీవ్‌ స్మిత్‌యాషెస్‌ సిరీస్.. విరాట్ కోహ్లీని అధిగమించిన స్టీవ్‌ స్మిత్‌

నిరూపించుకోవాల్సిందేమీ లేదు:

నిరూపించుకోవాల్సిందేమీ లేదు:

తాజాగా సానియా మాట్లాడుతూ... 'కెరీర్‌లో చాలా సాధించా. ఇన్ని ఘనతలు సాధిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఆగస్టులో పునరాగమనం చేస్తానని అనుకున్నా. కానీ కుదర్లేదు. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాతే ఆడాలని భావిస్తున్నా. బహుశా జనవరిలో బరిలో దిగుతా. రెండో ఇన్నింగ్స్‌లో కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. ఇక సాధించేవన్నీ బోనస్‌లే' అని సానియా పేర్కొంది.

ఆటపై ప్రేమతో మాత్రమే:

ఆటపై ప్రేమతో మాత్రమే:

'కేవలం ఆటపై ప్రేమతో మాత్రమే పునరాగమనం చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇజ్‌హాన్‌ నా ప్రపంచం. ఇజ్‌హాన్‌ కడుపులో ఉండగా 23 కిలోలు బరువు పెరిగా. ఇప్పుడు 26 కిలోలు తగ్గా. సరైన ఫిట్‌నెస్‌ కోసం ప్రయత్నిస్తున్నా. ఇప్పటికి శరీరంలో మార్పులు చూస్తున్నా. మరో రెండు నెలల్లో ఫిట్‌నెస్‌ సాధిస్తా. ఫిట్‌నెస్‌ విషయంలో తొందరపడి గాయాల పాలవడం సరైంది కాదు' అని సానియా తెలిపింది.

కెప్టెన్‌గా ఆ హక్కు కోహ్లీకి ఉంది.. అతని అభిప్రాయాన్ని గౌరవించాలి

పెద్ద లక్ష్యాలేం పెట్టుకోలేదు:

పెద్ద లక్ష్యాలేం పెట్టుకోలేదు:

'తల్లి అయ్యాక కొందరు మాత్రమే ఆటలో రాణించారు. ఈ తరంలో సెరెనా ఒకరు. సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాలనుకునే వారికి సెరెనా స్ఫూర్తిగా నిలుస్తుంది. 2017లో ఆటకు దూరమయ్యే సమయంలోనే మోకాలి గాయమైంది. అది ఇంకా పూర్తిగా తగ్గలేదు. దానిపై శ్రమిస్తున్నా. పునరాగమనం చేయడమే నా ఆశ. పెద్ద లక్ష్యాలేం పెట్టుకోలేదు. బాగా ఆడితే టోక్యో ఒలింపిక్స్‌పై దృష్టిసారిస్తా' అని సానియా చెప్పుకొచ్చారు.

Story first published: Friday, August 2, 2019, 13:44 [IST]
Other articles published on Aug 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X