Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా ఆ హక్కు కోహ్లీకి ఉంది.. అతని అభిప్రాయాన్ని గౌరవించాలి

Virat Kohli's Opinion On Coach Selection Should Be Respected Says Kapil Dev || Oneindia Telugu
We have to respect Captain Virat Kohlis opinion on coach selection says Kapil Dev

కోల్‌కతా: ప్రధాన కోచ్‌ ఎంపికలో టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. విరాట్‌ కోహ్లీ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ అభిప్రాయపడ్డారు. విండీస్ పర్యటనతో టీమిండియా ప్రధాన కోచ్‌తో సహా ఇతర సిబ్బంది పదవి కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ధరఖాస్తులు కూడా ఆహ్వానించింది.

మరోసారి కోచ్‌గా రవిశాస్త్రినే:

మరోసారి కోచ్‌గా రవిశాస్త్రినే:

విండీస్‌ పర్యటనకు బయల్దేరే ముందు విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. 'మరోసారి కోచ్‌గా రవిశాస్త్రిని చూడాలనుకుంటున్నా'అని తన అభిప్రాయాన్ని తెలిపాడు. అయితే రవిశాస్త్రిని కొనసాగిస్తే బాగుంటుందన్న విరాట్‌ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందనలు కొనసాగుతున్నాయి. కోచ్‌ ఎంపిక కమిటీలో ఉన్న సభ్యులు కపిల్‌దేవ్, శాంత రంగస్వామి ఈ విషయంపై గురువారం మాట్లాడాతూ తమ అభిప్రాయాలను తెలిపారు.

 కోహ్లీ అభిప్రాయాన్ని గౌరవిస్తాం:

కోహ్లీ అభిప్రాయాన్ని గౌరవిస్తాం:

ఈస్ట్‌ బంగాల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఏర్పాటై 100 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 'భారత్‌ గౌరవ్‌' పురస్కారాన్ని కపిల్‌ దేవ్‌కు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 'మేం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాలి. లాగే కోచ్‌ ఎంపికలో కెప్టెన్ కోహ్లీ అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తాం. కోచ్‌ ఎంపిక బాధ్యత కష్టంతో కూడుకున్న పని కాదు. తమ కర్తవ్యాన్ని శక్తిమేర నిర్వర్తిస్తాం' అని అన్నారు.

కెప్టెన్‌గా ఆ హక్కు ఉంది:

కెప్టెన్‌గా ఆ హక్కు ఉంది:

కోహ్లీ, రోహిత్‌ మధ్య విభేదాల వార్తలపై కపిల్‌ దేవ్‌ స్పందిస్తూ... 'మైదానం బయట ఎన్ని మనస్పర్థలైనా ఉండొచ్చు. అవన్ని అక్కడికే పరిమితం చేయాలి. ఇక మైదానంలోకి అడుగుపెడితే ఎలా ఆడుతున్నారనే విషయంపైనే దృష్టి సారించాలి' అని కపిల్‌ పేర్కొన్నాడు. 'కోచ్‌ ఎంపికలో కెప్టెన్‌గా తన అభిప్రాయం చెప్పే హక్కు కోహ్లీకి ఉంటుంది. కమిటీ సమష్టి నిర్ణయంతో కోచ్‌ను ఎంపిక చేస్తుంది. అనుభవం, సామర్థ్యం, నైపుణ్యాలను ప్రాతిపదికగా తీసుకుని ఎంపిక ప్రక్రియ చేస్తాం' అని శాంత రంగస్వామి తెలిపారు.

రేసు రసవత్తరం:

రేసు రసవత్తరం:

టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి సుమారు 2వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత కొంత మందిని మాత్రమే ఎంపిక చేసి వాళ్లకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కోచ్ పదవిలో ఉన్న రవిశాస్త్రికి పోటీగా హేమాహేమీలు రంగంలోకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. రాబిన్ సింగ్, లాల్ చంద్ రాజ్‌పుత్, టామ్ మూడీ, మైఖేల్ హెస్సన్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోగా.. గ్యారీ కిర్‌స్టన్, జయవర్దెనే కూడా బరిలో ఉన్నట్టు సమాచారం.

Story first published: Friday, August 2, 2019, 11:25 [IST]
Other articles published on Aug 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+