న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆటను ఆస్వాదిస్తున్నా: 900వ విజయంపై రఫెల్ నాదల్

By Nageshwara Rao
I dont feel old: Birthday boy Nadal after 900th win

హైదరాబాద్: ఆదివారం (జూన్ 3) తన 32వ పుట్టినరోజుని జరుపుకున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 34వ సారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. 11వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌కు మూడు అడుగుల దూరంలో నిలిచాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ నాదల్‌ 6-3, 6-2, 7-6 (7/4)తో మాక్సిమిలియన్‌ మార్టెరర్‌ (జర్మనీ)పై విజయ సాధించిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ అనంతరం రఫెల్ నాదల్ మాట్లాడుతూ "నాకు వయసు అయిపోతుందని భావించడం లేదు. నా వయసు 32. 2003 నుంచి నేను ఇక్కడ ఆడుతున్నాను. భవిష్యత్తులో మరిన్ని సంవత్సరాలు ఆడతా. యుక్త వయసులోనే టెన్నిస్ ఆడటం మొదలుపెట్టా. ఇక్కడ ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. ఈ టోర్నీని రోజు రోజుకీ ఎంతగానో ఆస్వాదిస్తున్నా" అని తెలిపాడు.

తాజా విజయం నాదల్‌ కెరీర్‌లో 900వ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో ఓపెన్‌ శకంలో (1967 తర్వాత) కనీసం 900 విజయాలు సాధించిన ఐదో ప్లేయర్‌గా నాదల్‌ గుర్తింపు పొందాడు. జిమ్మీ కానర్స్‌ (అమెరికా-1,256), ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌-1,149), లెండిల్‌ (అమెరికా-1,068), గిలెర్మో విలాస్‌ (అర్జెంటీనా-948) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భాగంగా మాక్సిమిలియన్‌ మార్టెరర్‌ (జర్మనీ)తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ పాత నాదల్‌ను తలపించాడు. గురి తప్పని ఫోర్‌ హ్యాండ్ షాట్లు, మిసైల్‌లా దూసుకెళ్లిన బ్యాక్‌హ్యాండ్ షాట్లు గురితప్పని సర్వీసులతో తొలి రెండుసెట్లను అలవోకగా గెలుచుకున్నాడు.

సర్వీస్ రిటర్న్స్‌తో భారీగా పాయింట్లు రాబట్టిన నాదల్ 39 విన్నర్లు, 29 అనవసర తప్పిదాలు చేశాడు. ఇక, మార్టెరర్ 29 విన్నర్లు, 35 అనవసర తప్పిదాలు చేశాడు. కాగా, మూడోసెట్లో మార్టెరర్ తీవ్రంగా పోరాడాడు. నాదల్‌కు దీటుగా పాయింట్లు సాధిస్తూ సెట్‌ను ట్రైబ్రేకర్‌కు తీసుకెళ్లాడు.

ట్రైబ్రేకర్‌లో తనదైన శైలితో ఆడి నాదల్ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రోలాండ్ గారోస్ క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా యువ సంచలనం, పదకొండవ సీడ్ డీగో స్కార్ట్స్‌మన్‌తో రఫెల్ నాదల్ తలపడనున్నాడు.

Story first published: Tuesday, June 5, 2018, 16:26 [IST]
Other articles published on Jun 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X