న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్వీన్ ఈజ్ బ్యాక్ - అందరూ తప్పుకోండమ్మా..!!

I am not retired, says Serena Williams and given hints that chances of a return are very high

న్యూయార్క్: అమెరికన్ టెన్నిస్ దిగ్గజం, నల్లకలువ సెరెనా విలియమ్స్..పునరాగమనం చేయబోతోన్నారు. మళ్లీ రాకెట్ పట్టబోతోన్నారు. తన ప్రధాన అస్త్రం పవర్ ప్లేతో ప్రత్యర్థులపై విరుచుకుపడటానికి సమాయాత్తమౌతోన్నారు. రెండు నెలల కిందటే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సెరెనా- అది శాశ్వత నిర్ణయం కాదని స్పష్టం చేశారు. మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగు పెట్టడానికి అధికావకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పారు.

అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ నిర్వహించిన కార్యక్రమానికి సెరెనా విలియమ్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు. రిటైర్మెంట్ తరువాతి జీవితం ఎలా ఉండబోతోందంటూ అడిగిన ప్రశ్నలకు ఆమె సూటిగా సమాధానాలిచ్చారు. తాను రిటైర్ కావట్లేదని స్పష్టం చేశారు. మళ్లీ రాకెట్ పట్టడానికి అధిక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన ఇంట్లోనే ఓ పెద్ద కోర్టు ఉందని, దాన్ని దర్శించాలనీ ఆహ్వానించారామె.

టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలనే ఆలోచనకు ప్రస్తుతం దూరంగా ఉంటోన్నానని, ఇదివరకు ప్రకటించిన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటోన్నానని సెరెనా అన్నారు. ఇప్పటికీ రిటైర్మెంట్ గురించి ఆలోచన చేయట్లేదని వివరించారు. రిటైర్మెంట్ ప్రకటించిన తరువాతి రోజే తన అడుగులు టెన్నిస్ కోర్ట్ వైపే పడ్డాయని చెప్పారు. ఇకపై టెన్నిస్ పోటీల్లో పాల్గొనట్లేదనే భావన తనను కుదురుగా ఉండనివ్వట్లేదని, ఆ ఆలోచనే తనకు విచిత్రంగా అనిపించిందని అన్నారు.

ధోనీ- కోహ్లీ సిక్సర్లు: ఎన్నిసార్లు చూసినా తనివి తీరవు..!!ధోనీ- కోహ్లీ సిక్సర్లు: ఎన్నిసార్లు చూసినా తనివి తీరవు..!!

ఇదివరకే సెరెనా విలియమ్స్ రిటైర్‌మెంట్ సంకేతాలు పంపించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది యూఎస్ ఓపెన్ టోర్నమెంట్‌లో ఆడట్లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. తన కేరీర్‌లో చివరి సింగిల్స్ టెన్నిస్ మ్యాచ్ ఇదే కావొచ్చని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని వెల్లడించే సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు..కన్నీటి పర్యంతం అయ్యారు. న్యూయార్క్‌లోని అర్థర్ ఆషె స్టేడియం వేదికగా జరిగిన యూఎస్ ఓపెన్ 2022 మూడో రౌండ్‌లో సెరెనా విలియమ్స్ ఓటమి చవి చూశారు.

కేరీర్‌లో ఆరు యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌ను సాధించిన సెరెనా. ఇప్పటివరకు మొత్తంగా 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. గేమ్ ముగిసిన తరువాత ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎమోషన్ అయ్యారు. తన టెన్నిస్ కెరీర్‌ను ముగించడానికి సిద్ధమవుతున్నానని చెప్పారు. ఇప్పటివరకు ఆరు యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించానని, ఇకపై ఈ సంఖ్య పెరగకపోవచ్చని వ్యాఖ్యానించారు.

Story first published: Tuesday, October 25, 2022, 12:10 [IST]
Other articles published on Oct 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X