న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూఎస్‌ ఓపెన్‌‌లో సంచలనం.. రోజర్ ఫెదరర్‌ ఓటమి

US Open 2019: Federer hopes ended as Dimitrov fights back to win instant classic

న్యూయార్క్‌: యుఎస్ ఓపెన్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం, 20 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ రోజర్ ఫెదరర్‌కు ఊహించని షాక్ తగిలింది. టైటిల్‌ సాధించాలనుకున్న మూడో సీడ్‌ రోజర్‌ ఫెదరర్‌ మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో గ్రిగర్‌ డిమిట్రోవ్‌ (బల్గేరియా) చేతిలో 6-3,4-6,6-3,4-6, 2-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. దీంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి ఫెదరర్‌ నిష్క్రమించాడు.

మూడు గంటల 12 నిముషాలు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి సెట్‌ను 6-3తో ఫెదరర్‌ సునాయాసంగా గెలిచాడు. అయితే పుంజుకున్న డిమిట్రోవ్‌ 4-6తో రెండో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఫెదరర్‌ తన అనుభవాన్ని ఉపయోగించి 6-3తో మూడో సెట్ గెలిచి ముందంజ వేసాడు. మళ్లీ దూసుకొచ్చిన డిమిట్రోవ్‌ 4-6తో నాలుగో సెట్ గెలిచి సమం చేసాడు. ఇక నిర్ణయాత్మక పోరులో డిమిట్రోవ్‌ ఆదినుంచే చెలరేగి 2-6తో సునాయాస విజయాన్ని అందుకున్నాడు.

78వ ర్యాంక్ డిమిట్రోవ్‌ మూడో సీడ్ ఫెదరర్‌కు షాకివ్వడం విశేషం. శుక్రవారం జరిగే సెమీస్‌లో రష్యా ఐదవ సీడ్ మెద్వెదేవ్‌తో డిమిట్రోవ్‌ తలపడనున్నాడు. 'మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది. మ్యాచ్‌లో ఉన్నానని ఎప్పటికప్పుడు నాకు నేను అనుకున్నా. శారీరకంగా నేను చాలా బాగున్నా. ఫెదరర్‌పై కొన్ని షాట్లు ఆడటం కష్టం అయింది' అని డిమిట్రోవ్‌ తెలిపాడు.

యూఎస్‌ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. టాప్ సీడ్ల పోరు ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. బెలిండా బెన్‌కిక్ (స్విట్జర్లాండ్) చేతిలో మహిళల సింగిల్స్ టాప్ సీడ్ నవోమీ ఒసాకా (జపాన్) పరాజయం పాలవ్వగా.. గాయం కారణంగా వావ్రింకా (స్విట్జర్లాండ్)తో జరుగుతున్న మ్యాచ్ మధ్యలోనే నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) వైదొలిగి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించిన స్పెయిన్‌ వీరుడు రఫెల్ నాదల్ క్వార్టర్స్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో విజయం సాధించిన ఐదో సీడ్ ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్) సెమీస్‌కు దూసుకెళ్లింది.

Story first published: Wednesday, September 4, 2019, 11:33 [IST]
Other articles published on Sep 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X