న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెంచ్ ఓపెన్ రౌండప్: పుంజుకున్న హలెప్, మూడో రౌండ్‌‌లోకి జొకోవిచ్‌

By Nageshwara Rao
French Open: Halep survives scare to beat Riske; Djokovic, Dimitrov sail through

హైదరాబాద్: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాలుగో రోజు స్టార్ల జోరు కొనసాగింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌, మహిళల్లో నాలుగోసీడ్‌ ఎలెనా స్విటోలినా, 8వ సీడ్‌ పెట్రా క్విటోవా అలవోక విజయాలతో మూడోరౌండ్‌కు దూసుకెళ్లగా, వరల్డ్ నంబర్ వన్ సిమోనా హలెప్ పట్టు విడవకుండా చివరి వరకు పోరాడి తొలిరౌండ్‌ గట్టెక్కింది.

వర్షం కారణంగా ఓ రోజు ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో టాప్‌సీడ్ హాలెప్ (రొమేనియా) 2-6, 6-1, 6-1తో ప్రపంచ 83వ ర్యాంకర్ అలిసన్ రిస్కీ (అమెరికా)పై గెలిచి రెండోరౌండ్‌లోకి అడుగుపెట్టింది. గంటా 34 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. నంబర్‌వన్ ప్లేయర్ ఆరంభంలో కాస్త తడబడి తొలిసెట్‌ను కోల్పోయింది.

ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న హలెప్.... తన ప్రత్యర్థిని రెండుగేమ్‌లకే పరిమితం చేస్తూ రెండుసెట్లను సులువుగా గెలిచింది. బలమైన సర్వీస్‌లు, సుదీర్ఘమైన ర్యాలీలు సంధిస్తూ అమెరికన్‌ను ఎక్కడిక్కడే కట్టడి చేసింది. 2014, 17లో రన్నరప్‌గా నిలిచిన హలెప్.. తొలిసెట్‌లో 16సార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.

టాప్ కాపాడుకోవాలంటే సెమీస్‌‌కు చేరాల్సిందే

టాప్ కాపాడుకోవాలంటే సెమీస్‌‌కు చేరాల్సిందే

హలెప్‌ టాప్‌ర్యాంక్‌ను కాపాడుకోవాలంటే ఈ టోర్నీలో కనీసం సెమీస్‌ వరకు చేరాల్సి ఉంది. మహిళల సింగిల్స్ రెండోరౌండ్లలో సీడెడ్ క్రీడాకారిణిలు అంచనాలు అందుకున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సాధించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన డెన్మార్క్‌ స్టార్‌ కరోలైన్‌ వొజ్నియాకి అదే జోరును ఫ్రెంచ్‌ ఓపెన్‌లో కొనసాగిస్తోంది.

మూడో రౌండ్‌లోకి ప్రవేశించిన వొజ్నియాకి

మూడో రౌండ్‌లోకి ప్రవేశించిన వొజ్నియాకి

సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ అయిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో వొజ్నియాకి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. గార్సియా పెరెజ్‌ (స్పెయిన్‌)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో రెండో సీడ్‌ వొజ్నియాకి 6-1, 6-0తో అలవోకగా గెలిచింది. 51 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో వొజ్నియాకి తన ప్రత్యర్థికి కేవలం ఒక గేమ్‌ మాత్రమే కోల్పోయింది.

 మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టిన జొకొవిచ్

మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టిన జొకొవిచ్

రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 6-3, 6-4తో కుజ్మోవా (స్లొవేకియా)పై, ఎనిమిదో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-0, 6-4తో అరూబెరెనా (స్పెయిన్‌)పై నెగ్గి మూడో రౌండ్‌లో అడుగు పెట్టారు. ఇక, పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్‌ జొకోవిచ్‌ 7-6 (7/1), 6-4, 6-4తో మునార్‌ (స్పెయిన్‌)పై, ఎనిమిదో సీడ్‌ గాఫిన్‌ (బెల్జియం) 7-5, 6-0, 6-1తో మూటెట్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించారు.

కష్టపడి గెలిచిన బెనోయిట్‌ పెయిర్‌

కష్టపడి గెలిచిన బెనోయిట్‌ పెయిర్‌

రెండో రౌండ్‌లో జ్వెరెవ్‌ 2-6, 7-5, 4-6, 6-1, 6-2తో లాజోవిక్‌ (సెర్బియా)పై, దిమిత్రోవ్‌ 6-7 (2/7), 6-4, 4-6, 6-4, 10-8తో డొనాల్డ్‌సన్‌ (అమెరికా)పై, నిషికోరి 6-3, 2-6, 4-6, 6-2, 6-3తో బెనోయిట్‌ పెయిర్‌ (ఫ్రాన్స్‌)పై కష్టపడి గెలిచారు. 12వ సీడ్‌ సామ్‌ క్వెరీ (అమెరికా) 6-1, 6-7 (3/7), 4-6, 1-6తో సిమోన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు.

Story first published: Thursday, May 31, 2018, 11:58 [IST]
Other articles published on May 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X