న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

11సార్లు ఫ్రెంచ ఓపెన్ టైటిల్ విజేతగా నాదల్

French Open 2018: Rafael Nadal beats Dominic Thiem to win 11th title

హైదరాబాద్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్‌‌‌లో తనకు తిరుగులేదని పదకొండోసారి నిరూపించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ నాదల్‌ 6-4, 6-3, 6-2తో ఏడో సీడ్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను మట్టికరిపించాడు. తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడిన 24 ఏళ్ల థీమ్‌ ఆరంభంలో గట్టి పోటీనే ఇచ్చినా.. క్రమంగా నాదల్‌ జోరుకు దాసోహమన్నాడు. నాదల్‌ 26 విన్నర్లు కొట్టాడు. మరోవైపు థీమ్‌.. ఏడు ఏస్‌లు కొట్టినప్పటికీ సర్వీసులో బాగా ఇబ్బంది పడ్డాడు. ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు, 42 అనవసర తప్పిదాలతో అతడు మూల్యం చెల్లించుకున్నాడు.

క్లే కోర్టులో తిరుగులేని ఆటగాడిగా పేరున్న నాదల్

క్లే కోర్టులో తిరుగులేని ఆటగాడిగా పేరున్న నాదల్

క్లే కోర్టులో తిరుగులేని ఆటగాడిగా పేరున్న నాదల్ ముందు తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఆడిన డామినిక్ నిలువలేకపోయాడు. క్లే కోర్టులో థీమ్‌కు మంచి రికార్డే ఉంది. ఇటాలియన్ ఓపెన్, మ్యాడ్రిడ్ ఓపెన్లలో నాదల్‌పై గెలిచాడు, కానీ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో మాత్రం నాదల్ ధాటికి నిలువలేకపోయాడు. 32 ఏళ్ల నాదల్ 24 సార్లు గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరగా.. 17 టైటిళ్లను గెలుపొందాడు. 3 యూఎస్ ఓపెన్ టైటిళ్లు, రెండు వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియా ఓపెన్‌ను నాదల్ సొంతం చేసుకున్నాడు. ఓపెన్ ఎరాలో కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకున్న పిన్న వయస్కుడిగానూ నాదల్ రికార్డ్ నెలకొల్పాడు.

తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌, అయినా నాదల్‌పై గెలిచి:

తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌, అయినా నాదల్‌పై గెలిచి:

థీమ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. అయినా నాదల్‌పై గెలిచిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ఎంతో ఆసక్తిరేపింది. ఐతే మ్యాచ్‌ హోరాహోరీగానే మొదలైనా.. క్రమంగా నాదలే శాసించాడు. తొలి సెట్లోనే ఆరంభంలోనే సర్వీసులు బ్రేకయ్యాయి. రెండో గేమ్‌లోనే బ్రేక్‌ సాధించి, నాదల్‌ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. థీమ్‌ వెంటనే బ్రేక్‌ సాధించి, సర్వీసు నిలబెట్టుకుని స్కోరు సమం చేశాడు. ప్రతి పాయింటుకూ ఇద్దరూ హోరాహోరీగా తలపడడంతో ఆట రసవత్తరంగా సాగింది.

ఆత్మవిశ్వాసం సన్నగల్లిన థీమ్‌లో పోరాటం కొరవడి:

ఆత్మవిశ్వాసం సన్నగల్లిన థీమ్‌లో పోరాటం కొరవడి:

అత్యంత ఆత్మవిశ్వాసంతో, రెట్టించిన ఉత్సాహంతో నిర్ణయాత్మక సెట్లో అడుగుపెట్టాడు. ఆత్మవిశ్వాసం సన్నగల్లిన థీమ్‌లో పోరాటం కొరవడింది. ఈసారి మరింత తేలిగ్గా తలవంచాడు. మూడు, ఏడో గేముల్లో థీమ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ అలవోకగా సెట్‌ను, ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. ఐతే ఎప్పటిలా భావోద్వేగంతో కిందపడి సంబరాలు చేసుకోలేదు. గాల్లో చేతులెత్తి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ట్రోఫీ అందుకున్నప్పుడు మాత్రం ఉద్వేగానికి గురయ్యాడు.

11వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న నాదల్

11వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న నాదల్

ఈ విజయంతో నాదల్ 11వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఒకే గ్రాండ్ స్లామ్‌ను అత్యధిక సార్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ రికార్డును నాదల్ సమం చేశాడు. మార్గరెట్ 1960-73 మధ్య 11 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుపొందింది.

Story first published: Monday, June 11, 2018, 15:32 [IST]
Other articles published on Jun 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X