న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేన్సర్‌తో పోరాడి...: మాజీ వింబుల్డన్‌ ఛాంపియన్‌ నొవోత్నా కన్నుమూత

By Nageshwara Rao
Former Wimbledon champion Novotna loses battle with cancer

హైదరాబాద్: మాజీ వింబుల్డన్‌ ఛాంపియన్‌, చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ స్టార్‌ యానా నొవోత్నా ఆదివారం కన్ను మూసింది. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో భాధపడుతోన్న 49 ఏళ్ల నొవోత్నా... చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచింది. మహిళల డబుల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్‌గా నిలిచిన నొవోత్నా... సింగిల్స్‌లో రెండో ర్యాంక్‌ను సాధించింది.

1993లో స్టెఫీగ్రాఫ్‌ చేతిలో, 1997లో మార్టినా హింగిస్‌ చేతిలో ఓడిన నొవోత్నా.. రన్నరప్‌గా నిలిచింది. అయితే 1998లో నటాలీ తౌజియట్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించి ఎట్టకేలకు తన వింబుల్డన్‌ టైటిల్‌ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. డబుల్స్‌లో ఆమె హెలెనా సుకోవా, అరంటా సాంజెస్‌, హింగిస్‌తో కలిసి 4 వింబుల్డన్‌ టైటిళ్లు గెలిచింది.

1987 నుంచి 1999 వరకు సాగిన తన కెరీర్‌ మొత్తంలో నొవాత్నా 24 సింగిల్స్, 76 డబుల్స్‌ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో 17 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ (సింగిల్స్‌లో ఒకటి, మహిళల డబుల్స్‌లో 12, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 4) ఉన్నాయి. 1988 సియోల్, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌ డబుల్స్‌లో రజతాలు నెగ్గింది. ఒక్క అట్లాంటా ఒలింపిక్స్‌లోనే సింగిల్స్‌లో కాంస్యం సాధించింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, November 21, 2017, 15:49 [IST]
Other articles published on Nov 21, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X