న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోర్టులోనే టీ షర్టు విప్పేసిన మహిళా టెన్నిస్ ప్లేయర్ (వీడియో)

Female U.S. Open Player Gets Violation for Removing Shirt on Court, Officials Call It a Mistake

ఫ్రాన్స్: క్రీడాకారులు ఎంత స్పోర్టివ్‌గా ఆలోచించినా అది కోర్టు నియమాలకు అనుగుణంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. గెలుపోటములను మ్యాచ్ ముగిసిన తర్వాత మర్చిపోయే ఆటగాళ్లు బాడీ లాంగ్వేజ్‌పై కూడా శ్రద్ధ పెట్టాలి. ఇవేమీ పట్టనట్లు మ్యాచ్ జరుగుతుండగానే కోర్టులో తన టీ షర్టును విప్పేసింది.

కొద్ది రోజుల ముందు మొదలైన ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఈ ఘటన నమోదైంది. ప్రాన్స్‌కు చెందిన అలిజె కార్నెట్.. న్యూయార్క్‌ ప్లేయర్ జొహన్నా లార్సన్‌తో మ్యాచ్ ఆడుతోంది. గేమ్ మధ్యలో సేద తీరేందుకు ఓ పది నిమిషాలు దొరికింది.

ఆ సమయంలో కోర్టు బయట ఉండగానే చెమట పట్టిందని తన టీ షర్టును తీసి పిండుకుని మళ్లీ వేసుకుంది. అయితే ఈ కాసేపటిలో ఆమె వెనుదిరిగి అలా చేయడంతో తను వేసుకున్న స్పోర్ట్స్ బ్రా కెమెరా కంట పడింది. కార్నెట్‌లో ఉన్న అంపైర్ ఆ విషయాన్ని గమనించి ఆమె కోర్టు నిబంధనలను ఉల్లంఘించిందంటూ అభిప్రాయపడ్డారు.

కానీ, గ్రాండ్ స్లామ్ టోర్నీ నిర్వహకులు ఇందులో ఎలాంటి తప్పు లేదని ఆమె ఏ క్రీడా నిబంధన ఉల్లంఘించలేదని తోసిపుచ్చారు. వారితో పాటుగా నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. చాలా మంది మగ ప్లేయర్లు గేమ్ మధ్యలో తమ షర్టు తీసేసి ఉన్న సంగతులను గుర్తు చేస్తున్నారు. అదే ఓ మహిళ విషయంలో ఇలా అనడం సబబు కాదని సూచిస్తున్నారు.

Story first published: Thursday, August 30, 2018, 19:04 [IST]
Other articles published on Aug 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X