న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20 ఫ్రాన్సీల వెండినాణెం విడుదల: జీవించి ఉన్న తొలివ్యక్తిగా రోజర్ ఫెదరర్ (వీడియో)

Federer posts thank you video after Swiss coin minted in his honour

హైదరాబాద్: టెన్నిస్‌ గ్రేట్ రోజర్‌ ఫెదరర్‌‌కు అరుదైన గౌరవం లభించింది. ఫెదరర్ వ్యక్తిత్వం, సాధించిన విజయాలకు గుర్తుగా స్విస్‌మింట్‌ రోజర్ ఫెదరర్ మీద వెండి నాణేలను రూపొందిస్తోంది. జనవరిలో ఈ నాణెలు మార్కెట్లోకి రానున్నాయి. జీవించి ఉండగానే ఈ గౌరవం పొందిన తొలి స్విస్ పౌరుడిగా ఫెదరర్ అరుదైన గుర్తింపు పొందాడు.

స్విట్జర్లాండ్‌ కరెన్సీలో 20 ఫ్రాన్సీల వెండి నాణేంపై ఫెదరర్ ఫోటోలను అక్కడి ప్రభుత్వం ముద్రించింది. 38 ఏళ్ల రోజర్ ఫెదరర్ 20 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచంలో గొప్ప టెన్నిస్ ఆటగాళ్లలో ఒకడు. అంతేకాదు స్విట్జర్లాండ్‌లో రోజర్ ఫెదరర్ ఓ జాతీయ హీరో కూడా.

భారత్ తలపడే ప్రతి సిరిస్‌లోనూ ఓ డే నైట్ టెస్టు మ్యాచ్: గంగూలీభారత్ తలపడే ప్రతి సిరిస్‌లోనూ ఓ డే నైట్ టెస్టు మ్యాచ్: గంగూలీ

ముందు వైపు రోజర్ ఫెదరర్ బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌

ముందు వైపు రోజర్ ఫెదరర్ బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌

దీంతో వెండి నాణేనికి ముందు వైపు రోజర్ ఫెదరర్ బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌ ఆడుతున్న చిత్రాన్ని ముద్రించారు. దీని విలువ 20.06 డాలర్లు ఉంటుంది. 55,000 నాణేలు ఉత్పత్తి అవుతాయని, మంగళవారం నుంచి డిసెంబర్ 19 వరకు ఈ నాణేలు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయని స్విస్‌మింట్ ధృవీకరించింది.

స్విస్‌మింట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ

స్విస్‌మింట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ

ఈ సందర్భంగా స్విస్‌మింట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ "రోజర్‌ ఫెదరర్‌ యొక్క క్రీడా విజయాలు, ధార్మిక సేవలు, తేలికైన మృదు స్వభావం, అభిమానులు సులువుగా కలుసుకొనే విధానం.. ఈ 20-ఫ్రాంక్ వెండి నాణెను అతడికి అంకితమిచ్చేలా స్విస్‌మింట్‌ను ప్రేరేపించాయి. తొలిసారి జీవించి ఉన్న వ్యక్తి గుర్తుగా నాణేలు విడుదల చేస్తున్నాం" అని అన్నారు.

వెండి నాణేలకు డిమాండ్ ఎక్కువ

రోజర్ ఫెదరర్‌ వెండి నాణేలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని స్విస్‌మింట్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో మే నెలలో మరో 40,000 నాణేలు విడుదల చేస్తామని, అయితే అవి ప్రత్యేక ఆకృతుల్లో 50 ఫ్రాన్సీల బంగారు నాణేలు అని స్విస్‌మింట్ పేర్కొంది. "ఈ అపురూప, అరుదైన గౌరవానికి స్విట్జర్లాండ్‌, స్విస్‌మింట్‌కు ధన్యవాదాలు" అని ఫెదరర్‌ ట్వీట్‌ చేశాడు.

స్విస్‌మింట్ రూపొందించిన స్మారక నాణేలలో

స్విస్‌మింట్ రూపొందించిన స్మారక నాణేలలో

ఈ ఏడాది స్విస్‌మింట్ రూపొందించిన స్మారక నాణేలలో చంద్రుని ల్యాండింగ్ 50వ వార్షికోత్సవంతో పాటు ఫుర్కా పాస్, రో జింకలు నాణేలు ఉన్నాయి. ఇటీవలి క్రీడా నేపథ్య స్మారక నాణెం 2015లో స్విస్ మింట్ విడుదల చేసింది. సాంప్రదాయ స్విస్ క్రీడ అయిన హోర్నుస్సేన్‌ను అక్కడి రైతులు పక్ మరియు కర్రతో ఆడతారు.

Story first published: Tuesday, December 3, 2019, 17:26 [IST]
Other articles published on Dec 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X