ఫెడ్ కప్‌: అంకిత అద్భుత ప్రదర్శన చేసినా.. చైనా చేతిలో భారత్ ఓటమి

Posted By:
Fed Cup: India lose 1-2 to China despite Ankita's stunning win

హైదరాబాద్: ఫెడరేషన్‌ కప్‌లో భారత్ ఓటమి పాలైంది. టోర్నీలో భాగంగా ఆసియా/ఓషియానియా గ్రూప్‌-1 టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత మహిళల జట్టు చైనా చేతిలో ఓటమి పాలైంది. 253వ ర్యాంకర్ అంకిత రైనా సింగిల్స్‌ మినహా తక్కిన రెండు మ్యాచ్‌లలో భారత్‌ ఓడిపోవడంతో చైనా 2-1 తేడాతో విజయాన్ని దక్కించుకుంది.

న్యూఢిల్లీలోని ఆర్కే ఖన్నా టెన్నిస్ స్టేడియంలోని సెంటర్ కోర్టులో జరిగిన మ్యాచ్‌లో ర్యాంకుల్లో తనకంటే మెరుగైన ర్యాంకులో ఉన్న లిన్‌ ఝును 6-3, 6-2 పాయింట్ల తేడాతో అంకిత ఓడించింది. ఆ తర్వాత తొలి సింగిల్స్‌లో కర్మన్‌ కౌర్‌ థండి 2-6, 2-6 స్కోరుతో యఫాన్‌ వాంగ్‌ చేతిలో ఓడిపోయింది.

అంకిత తన గెలుపుతో స్కోరును 1-1గా సమం చేసింది. అనంతరం జరిగిన డబుల్స్‌లో అంకిత-ప్రార్థన మాంబ్రె జోడీ యఫాన్‌ వాంగ్‌-జాక్సన్‌ యాంగ్‌ చేతిలో 2-6, 6-7(1-7) స్కోరుతో ఓడిపోవడంతో చైనా 2-1తో విజయం సాధించింది. టోర్నీలో భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో కజకిస్థాన్‌తో తలపడనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 8, 2018, 11:18 [IST]
Other articles published on Feb 8, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి