US Open 2021లో పెను సంచలనం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఎమ్మా! పిన్న వయస్కురాలిగా రికార్డు!!

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ 2021లో ఇంగ్లండ్ యువ టెన్నిస్‌ ప్లేయర్‌ ఎమ్మా రాడుకాను సంచలనం సృష్టించింది. యూఎస్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పిన్న వయస్కురాలిగా ఎమ్మా రికార్డు నెలకొల్పింది. గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న మొదటి క్వాలిఫయర్‌గా కూడా నిలిచింది. 17వ సీడ్‌ గ్రీస్‌ క్రీడాకారిణి మారియా సక్కారీపై 6-1, 6-4 తేడాతో సెమీఫైనల్స్‌లో గెలిచిన ఎమ్మా ఈ ఘనత అందుకుంది. దీంతో 17 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన పిన్న వయస్కురాలిగానూ రికార్డు నెలకొల్పింది. రష్యా అందం మారియా షరపోవా 2004లో 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్‌ టైటిల్‌ గెలుచుకుంది.

గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో గ్రీస్‌ ప్లేయర్‌ మారియా సక్కారీని 6-1, 6-4 తేడాతో ఓడించి ఎమ్మా రాడుకాను తుది పోరులో నిలిచింది. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 150వ స్థానంలో ఉన్న ఎమ్మా.. 17 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇక ఫైనల్‌లో మరో టీనేజర్‌, 19 ఏళ్ల కెనడా ప్లేయర్‌ లేలా ఫెర్నాండెజ్‌తో ఆమె తలపడనుంది. 1999 తర్వాత ఇలా యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఇద్దరు టీనేజర్లు ఫైనల్‌లో తలపడటం ఇదే మొదటిసారి. గతంలో 17 ఏళ్ల సెరీనా విలియమ్స్‌, 18 ఏళ్ల మార్టినా హింగిస్‌ను ఓడించి టైటిల్‌ గెలిచింది.

ఎమ్మా రాడుకాను సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో మారియా సక్కారీని ఓడించిన వీడియోను యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ ట్విటర్‌లో పంచుకుంది. 'ఆ ఒక్క పాయింట్‌ ఎమ్మా రాడుకాను జీవితాన్నే మార్చేసింది. మీరిప్పుడు యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో ఉన్నారు తెలుసా' అని ట్వీట్ చేసింది. వీడియోలో ఈ బ్రిటన్‌ ప్లేయర్ సాధించిన విజయాన్ని తనను తానే నమ్మలేకపోయింది. చివరి పాయింట్‌ సాధించాక కాసేపు తలను పట్టుకొని అలాగే ఉండిపోయింది.

తన అద్బుత విజయం గురించి ఎమ్మా రాడుకాను మాట్లాడుతూ... 'నేను యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరుకున్నాను. అసలు నేనిది నమ్మలేకపోతున్నాను. నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇది ఎవరైనా ఊహించారా?, నేను ఇప్పుడు టెక్నికల్‌గా ఫైనల్‌లో ఉన్నాను. షాకింగ్‌గా ఉంది. అదే సమయంలో ఎంతో సంతోషంగా ఉంది. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. తుది పోరులో మంచి ప్రదర్శన చేస్తా. మారియా సక్కారీ మంచి ప్లేయర్. టైటిల్ గెలవాలంటే చాలా కష్టపడాలి' అని పేర్కొంది.

Mrunal Thakur: విరాట్‌ కోహ్లీని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!!Mrunal Thakur: విరాట్‌ కోహ్లీని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!!

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) సెమీస్‌కు చేరాడు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జొకో.. తొలి క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌ తన పేరిట రాసుకునేందుకు రెండడుగుల దూరంలో ఉన్నాడు. బుధవారం పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో టాప్‌సీడ్‌ జొకోవిచ్‌ 5-7, 6-2, 6-2, 6-3తో ఆరో సీడ్‌ బెరెట్టిని (ఇటలీ)పై విజయం సాధించి సెమీస్‌కు చేరాడు. 3 గంటలా 27 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ కోల్పోయిన జొకో.. ఆ తర్వాత ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 10, 2021, 17:41 [IST]
Other articles published on Sep 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X