కోర్టులోనూ జోకోవిచ్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌.. ఇక ఇంటికి ప‌య‌నం

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలిచి అత్య‌ధిక గ్రాండ్ స్లామ్‌లు గెలిచ‌న ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాల‌ని ఆశ‌ప‌డిన జోకోవిచ్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. త‌న వీసాను పునురుద్ద‌రించాలంటూ ఆస్ట్రేలియాలోని ఫెడ‌ర‌ల్ కోర్టుకు వెళ్లిన జోకోవిచ్‌కు వ్య‌తిరేక ఫ‌లితం వ‌చ్చింది. జోకోవిచ్ వీసా ర‌ద్దును ఆమోదిస్తూ కోర్టు నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఆస్ట్రేలియా నిబంధ‌న‌ల ప్ర‌కారం మ‌రో 3 సంవ‌త్స‌రాల వ‌ర‌కు జోకోవిచ్ కంగారు గ‌డ్డ‌పై అడుగు పెట్ట‌డానికి అవ‌కాశం లేదు. దీంతో ఆస్ట్రేలియా ప్ర‌భుత్వానికి, జోకోవిచ్‌కు మ‌ధ్య 11 రోజులుగా న‌డిచిన వివాదానికి తెర‌ప‌డిన‌ట్టయింది. కాగా ఈ పోరులో అంతిమంగా ఆస్ట్రేలియా ప్ర‌భుత్వానిదే విజయం అయింది. అంతేకాకుండా జోకోవిచ్ స్వ‌దేశానికి తిరిగి వెళ్ల‌డానికి ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం త‌గిన ఏర్పాట్లు కూడా చేస్తోంది. దీంతో సోమ‌వారం ప్రారంభం కానున్న ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో జోకోవిచ్ పాల్గొన‌కుండానే వెనుదిరుగుతున్నాడు.

అస‌లు ఏం జ‌రిగిందంటే ఈ నెల 6న ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో పాల్గొన‌డానికి నోవాక్ జోకోవిచ్ ఆస్ట్రేలియా వెళ్లాడు. అయితే మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో దిగ‌గానే అక్క‌డి అధికారులు జోకోవిచ్‌ను అడ్డుకున్నారు. జోకోవిచ్ టీకా వేసుకోక‌పోవ‌డాన్ని గ్ర‌హించారు. అయితే టీకా వేసుకోక‌పోవ‌డానికి గ‌ల జోకోవిచ్ చెప్పిన కార‌ణం ప‌ట్ల ఎయిర్‌పోర్టు అధికారులు సంతృప్తి చెంద‌లేదు. దీంతో జోకోవిచ్ వీసాను ర‌ద్దు చేశారు. దీంతో త‌న‌కు న్యాయం చేయాలంటూ జోకోవిచ్ కోర్టును ఆశ్ర‌యించాడు. త‌న‌కు క‌రోనా సోకినందు వల్లే వ్యాక్సిన్ వేసుకోలేక పోయాన‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు. జోకోవిచ్ వివ‌ర‌ణతో సంతృప్తి చెందిన న్యాయ‌స్థానం అత‌ని వీసాను పునురుద్ద‌రింప చేయాల‌ని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అయితే దీనోక స‌వాల్‌గా స్వీక‌రించిన ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ఈ సారి బ‌ల‌మైన ఆధారాల‌తో వీసాను రెండో సారి ర‌ద్దు చేసింది. జోకోవిచ్ క‌రోనా వ్యాక్సిన్ వేసుకోలేద‌ని, దీంతో ప్ర‌జ‌ల ఆరోగ్యం దృష్యా అత‌ని వీసాను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

అయితే ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం జోకోవిచ్ వీసాను రెండో సారి ర‌ద్దు చేయ‌డానికి ఒక రోజు ముందు ఆస్ట్రేలియన్ ఓపెన్ డ్రాలో అత‌ని పేరు కూడా నిర్వ‌హ‌కులు వెల్ల‌డించారు. దీంతో అత‌ను టోర్నీలో పాల్గొన‌డం ఖాయ‌మ‌ని, వీసా స‌మ‌స్య‌లు తొలగిపోయాన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేష‌న్ మంత్రి మ‌రోసారి వీసాను ర‌ద్దు చేసి షాకిచ్చారు. ఈ సారి కోర్టులోనూ జోకోవిచ్‌కు వ్య‌తిరేక తీర్పు రావ‌డంతో ఇంటి దారి పట్ట‌క త‌ప్పని ప‌రిస్థితి నెల‌కొంది. కోర్టులో వ్యాక్సిన్ మినహాయింపు కోరుతూ జోకోవిచ్ చెప్పిన విష‌యాల ప‌ట్ల న్యాయ‌మాత్రం ఏ మాత్రం సంతృప్తి చెంద‌లేదు. దీంతో వీసాను ర‌ద్దు చేశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, January 16, 2022, 15:42 [IST]
Other articles published on Jan 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X