న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'పేస్, బోపన్నలు విడిగా ఆడైనా గెలవొచ్చు'

Davis Cup: Should Leander Paes have been paired with Rohan Bopanna? Vijay Amritraj weighs in

హైదరాబాద్: పెద్ద సమస్యకు పరిష్కారం దొరికిందన్నంత స్థాయిలో మాట్లాడుతున్నాడు టెన్నిస్ దిగ్గజం విజయ్‌ అమృత్‌రాజ్‌. డేవిస్‌కప్‌లో భాగంగా పురుషుల డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌, రోహన్‌ బోపన్నలు కలిసి ఆడాలంటూ బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియా(బాయ్) నిర్దేశించింది. దీనిపై అయిష్టత వ్యక్తం చేసిన బోపన్న ఈ టోర్నీలో జోడి గురించి మళ్లీ ఆలోచించాలని బాయ్‌కు లేఖ రాశాడు. ఈ విషయంపై తాజాగా స్పందించిన విజయ్‌ అమృత్‌రాజ్‌ విడివిడిగా ఆడి కూడా గెలవొచ్చు అని అంటున్నాడు.

డబుల్స్‌లో వాళ్లు వేరే భాగస్వాములను ఎన్నుకుంటే సరిపోతుందని అతను చెప్పాడు. అయినా డేవిస్‌కప్‌లో సింగిల్స్‌ మ్యాచ్‌ల గురించి ఆలోచించకుండా డబుల్స్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని అతను ప్రశ్నించాడు. బోపన్నకు పేస్‌తో ఆడడం ఇష్టం లేకున్నా వచ్చే నెల చైనాతో డేవిస్‌కప్‌లో పోరులో వాళ్లిద్దరూ కలిసి ఆడాల్సిందేనని అఖిల భారత టెన్నిస్‌ సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే.

'పేస్‌, బోపన్న కలిసి ఆడడం కుదరకపోతే వాళ్లిద్దరూ వేరే భాగస్వాములతో విడిగా డబుల్స్‌ ఆడాలి. అయినా నా దృష్టిలో ఇది రెండో ప్రాధాన్యత విషయం. ఎందుకంటే ముందు సింగిల్స్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ గ్రూప్‌కు అర్హత సాధించి ఆ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరచడమే మన లక్ష్యం. ప్రపంచ గ్రూప్‌కు అర్హత సాధించాలంటే ఆటగాళ్ల ర్యాంకులు 50లోపు ఉండాలి. నిజంగా చెప్పాలంటే ముఖ్యమైన దాని గురించి కాకుండా అవసరం లేని విషయాల గురించి చాలా ఎక్కువగా చర్చిస్తున్నారు.

డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ స్పెషలిస్ట్‌ ఆటగాడిగా కావాలని ఎవరూ టెన్నిస్‌ మొదలుపెట్టరు. ఐదేళ్ల పిల్లాణ్ని అడిగినా..ఉత్తమ మిక్స్‌డ్‌ డబుల్‌ ఆటగాడిగా కావాలనుంది అని చెప్పడు. అది కుదిరే పని కాదు. మరో రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌ కావాలి అని లక్ష్యంగా పెట్టుకోవాలి'' అని అమృత్‌రాజ్‌ తెలిపాడు. డబుల్స్‌ విభాగంలో భారత్‌ ఎప్పుడూ బలంగా ఉందనే విషయాన్ని అతను అంగీకరించాడు.

Story first published: Wednesday, March 21, 2018, 12:30 [IST]
Other articles published on Mar 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X