డేవిస్ కప్‌లో తొలిరోజు: పాకిస్థాన్‌పై 2-0 ఆధిక్యంలో టీమిండియా

హైదరాబాద్: నూర్ సుల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డేవిస్ కప్ పోరులో తొలిరోజైన శుక్రవారం భారత్ 2-0తో పాక్‌పై ఆధిక్యం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్, సుమిత్ నగాల్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించింది. 42 నిమిషాల పాటు జరిగిన తొలి సింగిల్స్‌లో రామనాథన్ 6-0, 6-0తో మహ్మద్ షోయబ్ (17 ఏళ్లు)ను ఓడించాడు.
మరో సింగిల్స్ మ్యాచ్‌లో సుమిత్ నగాల్ హఫైజా మహ్మద్ రెహ్మాన్‌ను 6-0, 6-2 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. డేవిస్ కప్‌లో సుమిత్ నగాల్‌కు ఇది తొలి విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో హఫైజా సుదీర్ఘ ర్యాలీలు ఆడాడు. రెండో సెట్ రెండో గేమ్‌లో నగాల్‌ను రెండు డ్యూస్ పాయింట్లు ఆడేలా చేశాడు.
శనివారం జరిగే డబుల్స్‌లో హఫైజా, షోయబ్ జోడీతో లియాండర్ పేస్, తొలిసారి డేవిస్ కప్‌లో ఆడనున్న జీవన్ నెడుంచెళియన్ జోడీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే డేవిస్ కప్ చరిత్రలో డబుల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా లియాండర్ పేస్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంటాడు.
ఇప్పటికే లియాండర్ పేస్ 43 విజయాలు సాధించాడు. ఈ టైలో గెలిచిన జట్టు వరల్డ్ గ్రూప్ క్వాలిఫయిర్స్ కోసం క్రొయేషియా వెళ్లనుంది. పాక్‌లో కాకుండా తటస్థ వేదికలో ఈ డేవిస్ కప్‌ను నిర్వహించడంతో నిరసనగా పాక్ సీనియర్ ఆటగాళ్లు ఈ టైకి దూరమయ్యారు. డేవిస్ కప్ టైలో ఇప్పటివరకు 6 సార్లు తలపడగా భారత్ ఓడిపోలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications