న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేవిస్ కప్: తొలి మ్యాచ్‌లో సెప్పీతో తలపనున్న రామ్‌కుమార్‌

Davis Cup: Ramkumar to play Seppi in opening rubber, Italy keep Marco out of singles

హైదరాబాద్: అచ్చొచ్చిన వేదికపై డేవిస్‌ కప్‌ గ్రూప్‌ ఫైనల్స్‌ లక్ష్యంగా భారత పురుషుల టెన్నిస్‌ జట్టు బరిలోకి దిగుతోంది. శుక్రవారం మొదలయ్యే డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో మాజీ చాంపియన్‌ ఇటలీతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు జట్లూ తలపడడం 21 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలో తొలి రోజు రెండు సింగిల్స్‌ను నిర్వహిస్తారు. రెండో రోజు తొలుత డబుల్స్‌ మ్యాచ్‌, ఆ తర్వాత రెండు రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. గంట ముందు వరకు ఆటగాళ్ల మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. మ్యాచ్‌ల్ని ఐదు సెట్ల బదులు మూడు సెట్లకు కుదించారు.

2023 వరల్డ్ కప్‌కు భారతే ఆతిథ్యమిస్తుంది: ఐసీసీ సీఈఓ రిచర్డ్‌సన్2023 వరల్డ్ కప్‌కు భారతే ఆతిథ్యమిస్తుంది: ఐసీసీ సీఈఓ రిచర్డ్‌సన్

తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ vs సెప్పి

తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ vs సెప్పి

తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్‌ ఆండ్రియా సెప్పి (ఇటలీ)తో 129వ ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌ తలపడనున్నాడు. రెండో సింగిల్స్‌లో ప్రపంచ 129వ ర్యాంకర్‌ మాటియో బెరెటిని (ఇటలీ)తో భారత నంబర్‌వన్, ప్రపంచ 102వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తలపడతారు. ఇటలీ టాప్‌ ర్యాంకర్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్న మార్కో సెచినాటోను సింగిల్స్‌ మెయిన్‌ డ్రాలో పక్కనబెట్టడం ఆశ్చర్యం కలిగించింది.

మంచి నిర్ణయమే తీసుకున్నా

మంచి నిర్ణయమే తీసుకున్నా

అయితే, ప్రసుత్త పరిస్థితుల్లో తాను మంచి నిర్ణయమే తీసుకున్నానని నాన్‌ప్లేయింగ్‌ కెప్టెన్‌ కొర్రాడో బరాజుట్టీ చెప్పడం విశేషం. శనివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో రోహన్‌ బోపన్న-దివిజ్‌ శరణ్‌లు షెక్కినాటో-సిమోన్‌ బొలెల్లీతో తలపడనున్నారు. రివర్స్‌ సింగిల్స్‌లో బెరెటినితో రామ్‌కుమార్‌, సెప్పితో ప్రజ్నేశ్‌ తలపడతారు. సొంత గడ్డపై ఆడనుండటం, అదీ ఇటలీ ఆటగాళ్లకు అంతగా అలవాటులేని పచ్చిక కోర్టులపై మ్యాచ్‌లను నిర్వహించడం భారత్‌కు సానుకూలాంశం.

ముఖాముఖి రికార్డులో వెనుకబడిన భారత్

ముఖాముఖి రికార్డులో వెనుకబడిన భారత్

కోల్‌కతా సౌత్‌ క్లబ్‌లోని పచ్చిక కోర్టులపై నిర్వహిస్తున్న ఈ వేదికపై భారత్‌ గెలుపోటముల రికార్డు 8-2తో ఉంది. ఇదే వేదికపై చివరిసారి ఇటలీతో 1985 వరల్డ్‌ గ్రూప్‌ తొలి రౌండ్‌లో ఆడిన భారత్‌ 3-2తో విజయాన్ని అందుకుంది. మొత్తంగా ముఖాముఖి రికార్డులో భారత్‌ 1-4తో వెనుకబడి ఉంది. చివరిసారి ఇటలీతో 1998లో వరల్డ్‌ గ్రూప్‌ తొలి రౌండ్‌లో తలపడిన భారత్‌ 1-4తో పరాజయం పాలైంది.

ఈ ఏడాది నుంచి కొత్త ఫార్మాట్‌లో డేవిస్‌ కప్‌

ఈ ఏడాది నుంచి కొత్త ఫార్మాట్‌లో డేవిస్‌ కప్‌

ఈ ఏడాది నుంచి డేవిస్‌ కప్‌ను కొత్త ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. కాగా డేవిస్‌ కప్‌ ఫైనల్స్‌లో 12 బెర్త్‌ల కోసం 24 జట్లు తలపడనున్నాయి. క్వాలిఫయింగ్‌లో గెలిచిన 12 జట్లు నవంబర్‌ 18 నుంచి 24 వరకు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో 18 జట్ల మధ్య జరిగే ఫైనల్స్‌ టోర్నీకి అర్హత సాధిస్తాయి. 2018లో సెమీస్‌ చేరిన జట్లతోపాటు మరో రెండు టీమ్‌లు ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించాయి.

Story first published: Friday, February 1, 2019, 10:35 [IST]
Other articles published on Feb 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X