న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేవిస్ కప్‌: భారత్ చేతిలో పాక్ చిత్తు, 44 విజయాలతో లియాండర్ పేస్ రికార్డు!

Davis Cup 2019 : India Secure Win vs Pak With Leander Paes' Record-Extending 44th Victory
Davis Cup: India secure win vs Pakistan with Leander Paes record-extending 44th victory

హైదరాబాద్: తటస్థ వేదిక నూర్‌ సుల్తాన్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డేవిస్ కప్‌లో భారత జట్టు తన జోరుని కొనసాగిస్తోంది. పాకిస్థాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 3-0 ఆధిక్యంలో నిలిచింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ విభాగంలో లియాండర్ పేస్-నెడుంజెళియన్‌ జోడి 6-1, 6-3 తేడాతో మహ్మద్‌ షోయబ్‌, హఫైజా అబ్దుల్‌ రెహ్మాన్‌ జోడీపై నెగ్గింది.

వీరిద్దరూ కేవలం 53 నిమిషాల్లో ఆటను ముగించడం విశేషం. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న భారత జోడికి రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. రెండో సెట్‌లో లియాండర్‌ పేస్‌ జోడీ​ అద్భుతమైన స్మాష్‌లను సంధించి మ్యాచ్‌లో పైచేయి సాధించింది. చివరకు 6-3 తేడాతో సెట్‌ను గెలుచుకోవడంతో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది.

Australia vs Pakistan: ట్రిపుల్ సెంచరీ సెంచరీతో డేవిడ్ వార్నర్ సాధించిన రికార్డులివే!Australia vs Pakistan: ట్రిపుల్ సెంచరీ సెంచరీతో డేవిడ్ వార్నర్ సాధించిన రికార్డులివే!

ఈ విజయంతో భారత వెటరన్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. డేవిస్‌కప్‌ డబుల్స్‌ విభాగంలో 44వ విజయాన్ని అందుకున్నాడు. ఫలితంగా డేవిస్‌కప్‌ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా తన రికార్డుని మరింత పదిలం చేసుకున్నాడు. పేస్ తర్వాత స్థానంలో ఇటాలియన్‌ ఆటగాడు నికోలా పీట్రెంజెలీ(42) ఉన్నాడు.

అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్ట్: వార్నర్ ట్రిపుల్ సెంచరీ, తొలి ఇన్నింగ్స్ 589-3 డిక్లేర్అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్ట్: వార్నర్ ట్రిపుల్ సెంచరీ, తొలి ఇన్నింగ్స్ 589-3 డిక్లేర్

నికోలా పీట్రెంజెలీ 66 టైల్లో 42 విజయాలు సాధించగా పేస్‌ కేవలం 56 టైల్లోనే 43 గెలిచాడు. ప్రస్తుతం టెన్నిస్‌ ఆడుతున్న డబుల్స్‌ ప్లేయర్లు ఎవరూ టాప్‌-10లో లేకపోవడం విశేషం. బెలారస్‌కు చెందిన మాక్స్‌ మిర్నేయి డేవిస్‌కప్‌లో 36 డబుల్స్‌ విజయాలతో మూడో స్థానంలో ఉన్నప్పటికీ 2018 నుంచి టోర్నీలో పాల్గొనడం లేదు.

Story first published: Saturday, November 30, 2019, 15:51 [IST]
Other articles published on Nov 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X