న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఫెదరర్ చేసే పనేంటో తెలుసా?

By Nageshwara Rao
 Charity looms large for Federer in post-retirement life

హైదరాబాద్: స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ లేకుండా టెన్నిస్ ప్రపంచాన్ని ఊహించడం కష్టం. కోర్టులో తన అద్భుతమైన స్ట్రోక్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత రోజర్ ఫెదరర్ ఫౌండేషన్ ద్వారా సమాజ సేవలో పాల్గొంటానని చెప్పాడు.

తాజాగా రోజర్‌ ఫెదరర్‌తో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ టెన్నిస్‌ ఆడాడు. 'మ్యాచ్‌ ఫర్‌ ఆఫ్రికా' పేరిట రోజర్ ఫెదరర్ ఫౌండేషన్‌ కోసం విరాళాల సేకరణ నిమిత్తం కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ ఛారిటీ మ్యాచ్‌కు భారీ స్పందన లభించింది.

ఫెదరర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఛారిటీ మ్యాచ్‌

ఫెదరర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఛారిటీ మ్యాచ్‌

ఆఫ్రికాలోని పేద విద్యార్థుల చదువుకు చేయూతనిచ్చేందుకు ఫెదరర్ ఫౌండేషన్ ఈ ఛారిటీ మ్యాచ్‌ని ఏర్పాటు చేసింది. ఈ ఛారిటీ మ్యాచ్‌ను 15,000 మంది అభిమానులు ప్రత్యక్షంగా తిలకించడంతో 2 మిలియన్ల డాలర్లు కంటే ఎక్కువ విరాళాలు సమకూరాయి. పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్‌ విజేతగా నిలిచాడు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బిల్ గేట్స్‌తో కలిసి మ్యాచ్

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బిల్ గేట్స్‌తో కలిసి మ్యాచ్

సోమవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోజర్‌ ఫెదరర్‌-బిల్‌గేట్స్‌ జోడీ విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో బిల్‌గేట్స్-రోజర్ ఫెదరర్‌లు ఒకవైపు జోడీ కట్టగా, మరొకవైపు అమెరికా ప్లేయర్‌ జాక్‌ సాక్-ఎన్‌బీసీ టీవీ ప్రముఖ యాంకర్‌ సావన్నా గుత్రి ఆడారు. డబుల్స్‌లో బిల్‌గేట్స్‌తో జతకట్టిన ఫెదరర్‌ 2-0తో సోక్‌-గుత్రి జోడీని ఓడించారు.

ఫౌండేషన్‌తో కలిసి పనిచేసేందుకు ఎక్కువ సమయం

ఫౌండేషన్‌తో కలిసి పనిచేసేందుకు ఎక్కువ సమయం

మ్యాచ్ అనంతరం రోజర్ ఫెదరర్ మాట్లాడుతూ 'నా టెన్నిస్ కెరీరీ ముగిసిన తర్వాత ఈ మూమెంట్ తప్పక వస్తుంది. నా ఫౌండేషన్‌తో కలిసి పనిచేసేందుకు నాకు ఎక్కువ సమయం లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఎక్కువ సార్లు ఆఫ్రికాకు ట్రావెల్ చేస్తా. ఫౌండేషన్ కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూస్తా. మంచిపనుల కోసం మరిన్ని విరాళాలు సేకరిస్తా' అని అన్నాడు.

 ఫెదరర్‌కు పెద్ద అభిమానిని: బిల్ గేట్స్

ఫెదరర్‌కు పెద్ద అభిమానిని: బిల్ గేట్స్

'అవును, సమాజ సేవ అనేది ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఈ విషయంలో నా నాలెడ్జి, అనుభవం కూడా పెరుగుతూనే ఉంటుంది. ఓ మంచి ఫిలాంత్రఫిస్ట్ అవడం అనేది ముగిసిపోని ఓ జర్నీ లాంటింది' అని ఫెదరర్ చెప్పాడు. ఇక, బిల్ గేట్స్ మాట్లాడుతూ ‘ఫెదరర్‌తో కలిసి ఆడాలన్నది నా కల. ఇది ఇన్నేళ్లకు తీరింది. నేను అతనికి అభిమానిని' అని అన్నారు.

Story first published: Wednesday, March 7, 2018, 16:35 [IST]
Other articles published on Mar 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X