న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్న వోజ్నియాకి

Caroline Wozniacki will retire after bid to regain Australian Open title

హైదరాబాద్: మాజీ వరల్డ్ నంబర్ వన్ కరోలినా వోజ్నియాకి టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. డెన్మార్క్‌కు చెందిన కరోలినా వోజ్నియాకి వచ్చే ఏడాది జనవరిలో జరిగే తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించింది.

ఈ సందర్భంగా వోజ్నియాకి "టెన్నిస్‌లో నేను కోరుకున్నవన్నీ సాధించాను. నా జీవితంలో ఆట కంటే ఇతర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సమయం వస్తే టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని అనుకున్నాను" అని తన ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. వోజ్నియాకి తన కెరీర్‌లో 30 సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచింది.

2005లో 15 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌ టెన్నిస్ ప్లేయర్‌గా మారిన వొజ్నియాకి 2010లో అక్టోబరులో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ స్థానంలో సుమారు 71 వారాలు కొనసాగింది. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలిచింది.

వోజ్నియాకి తన కెరీర్‌లో గెలిచిన ఏకైక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఇదే కావడం విశేషం. 2009, 2014 యూఎస్‌ ఓపెన్‌ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. గత కొంతకాలంగా వోజ్నియాకిని గాయాలు వేధిస్తున్నాయి. ఈ ఏడాది కేవలం ఒక టోర్నీలో మాత్రమే ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వొజ్నియాకి 37వ స్థానంలో ఉంది.

Story first published: Saturday, December 7, 2019, 10:44 [IST]
Other articles published on Dec 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X