న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరిహారం ఇవ్వాల్సిందే!: అమెరికా కోర్టులో బౌచర్డ్‌కు అనుకూలంగా తీర్పు

By Nageshwara Rao
Bouchard 'vindicated' after USTA settlement

హైదరాబాద్: అమెరికా టెన్నిస్ సంఘం (యుఎస్‌టీఏ) నిర్లక్ష్యం కారణంగానే కెనడా టెన్నిస్ స్టార్ యుజిని బౌచర్డ్‌ గాయపడిందని అమెరికా కోర్టు తేల్చింది. 2015 యుఎస్‌ ఓపెన్‌ సందర్భంగా లాకర్‌ రూమ్‌లో కాలుజారి పడడంతో గాయపడ్డానని, అది తన కెరీర్‌ను దెబ్బతీసిందని ఆరోపిస్తూ, తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ యుఎస్‌టీఏపై కోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే.

Subscribe to Mykhel Telugu NewsletterSubscribe to Mykhel Telugu Newsletter

ఈ కేసులో తొలి దశ విచారణ పూర్తి చేసిన కోర్టు యుఎస్‌టీఏను తప్పుపట్టింది. లాకర్‌ రూమ్‌లో బౌచర్డ్‌ గాయపడడంలో ఆమె తప్పు 25 శాతం కాగా, యూఎస్‌టీఏ నిర్లక్ష్యం 75 శాతం ఉందని వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పుపై బౌచర్డ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా బౌచర్డ్ మాట్లాడుతూ 'రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు సంతోషంగా ఉంది' అని పేర్కొంది.

'కోర్టు తీర్పులో నాకు క్లీన్ చిట్ వచ్చింది. ప్రస్తుతం ఉపశమనంతో పాటు ఆనందంగా ఉంది' అని బౌచర్డ్ తెలిపింది. ఈ కేసు తుది దశ విచారణ ముగిశాక బౌచర్డ్‌కు చెల్లించాల్సిన పరిహారంపై కోర్టు తీర్పు ఇవ్వనుంది. యుఎస్‌టీఏ తరుపున వాదించిన లాయర్ అలెన్ కమిన్కై మాట్లాడుతూ 'యుఎస్‌టీఏ, బౌచర్డ్ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకుంటే మంచిది. బౌచర్డ్‌కు ఆల్ ద బెస్ట్' అని అన్నారు.

అసలేం జరిగింది?:
న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో 2015లో యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (యుఎస్‌టీఏ) గ్లాండ్ స్లామ్ టోర్నీని నిర్వహించింది. ఆ టోర్నీలో లాకర్ రూమ్‌లో తాను కాలు జారి కింద పడటంతో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడానని విచారణ సందర్భంగా బౌచర్డ్‌ కోర్టులో చెప్పింది.

'బాగా జారేలా, ప్రమాదకరంగా ఉన్న శుభ్రపరిచే పదార్థాలు వాడడం వల్లే నేను జారిపడ్డాను' అని బౌచర్డ్‌ తన దావాలో పేర్కొంది. జారి కిందపడటం వల్ల తల నేలకు బలంగా గుద్దుకుందని, మెదడు అదరడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

మీ వల్లే లాకర్‌ రూమ్‌లో కాలుజారి పడ్డా: పరిహారం ఇవ్వాలని కోర్టులో బౌచర్డ్ దావామీ వల్లే లాకర్‌ రూమ్‌లో కాలుజారి పడ్డా: పరిహారం ఇవ్వాలని కోర్టులో బౌచర్డ్ దావా

బౌచర్డ్‌ ఆలస్యంగా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో ఆడి వచ్చిందని, రాత్రి 11 గంటల సమయంలో గదిని శుభ్రం చేస్తారన్న విషయం ఆమెకు తెలిసే ఉంటుందని యుఎస్‌టీఏ తెలపడం విశేషం. దీంతో రాత్రి 11 గంటల వరకే లాకర్‌ రూమ్‌ను వాడుకోవాలని టోర్నీ హ్యాండ్‌బుక్‌లో ఎక్కడ లేదని బౌచర్డ్‌ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.

జారిపడడం వల్ల అయిన గాయంతో బౌచర్డ్‌ కెరీర్‌ దెబ్బతిందని, ఆమె ర్యాంకింగ్స్‌లో కూడా ఆమె స్థానం దిగజారిందని తెలిపారు. ఆ గాయం నుంచి కోలుకున్నా బౌచర్డ్‌ ఫామ్‌ అందుకోలేకపోయిందని కోర్టుకు తెలిపారు.

Story first published: Saturday, February 24, 2018, 11:08 [IST]
Other articles published on Feb 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X