న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ టాప్ ప్లేయర్లతో కళకళలాడనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్

 Australian Open: World’s top players confirm AO 2020 entry

హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ స్టార్ ప్లేయర్లతో కళకళలాడనుంది. ఈ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ అయిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 7ల తేదీ వరకు మెల్ బోర్న్ పార్క్‌లో జరగనుంది. ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను ఇటీవలే నిర్వాహాకులు విడుదల చేశారు.

విక్టోరియా అజరెంకా మినహా పురుషులు, మహిళల విభాగంలో టాప్‌-50 ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. ఈ టోర్నీలో పురుషుల్లో అగ్రస్థానంలో ఉన్న స్పెయిన్ బుల్ రఫెల్‌ నాదల్‌, మహిళల్లో అగ్రస్థానంలో ఆష్లే బార్టీ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు నిర్వాహాకులు శుక్రవారం ప్రకటించారు.

పది కిలోల బ్యాట్‌, 2.5 కిలోల చేయి: చాహల్‌ను ట్రోల్ చేసిన కోహ్లీపది కిలోల బ్యాట్‌, 2.5 కిలోల చేయి: చాహల్‌ను ట్రోల్ చేసిన కోహ్లీ

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తన ఎనిమిదో గ్రాండ్ స్లామ్‌పై గురిపెట్టాడు. 38 ఏళ్ల స్విస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ తన కెరీర్‌లో ఏడోసారి ఈ ట్రోఫీ సాధించాలని మరింత పట్టుదలగా బరిలోకి దిగుతున్నాడు. ఇక, ఏడుసార్లు ఛాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ తన కలను నెరవేర్చుకుంటుందో లేదో చూడాలి.

ఇది ఊహించలేదు!: వినూత్న సంబరాలతో ఓవర్‌నైట్ స్టార్ అయిన ఆప్ఘన్ స్పిన్నర్ (వీడియో)ఇది ఊహించలేదు!: వినూత్న సంబరాలతో ఓవర్‌నైట్ స్టార్ అయిన ఆప్ఘన్ స్పిన్నర్ (వీడియో)

మార్గరెట్‌ కోర్ట్‌ 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేసేందుకు సెరెనా విలియమ్స్ కేవలం ఒక్క గ్రాండ్ స్లామ్ ట్రోఫీ దూరంలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాదిగా సెరెనా ప్రయత్నిస్తున్నా ట్రోఫీని మాత్రం గెలవలేకపోయింది.
నొవోమి ఒసాకా (జపాన్‌), మాజీ చాంపియన్‌ కరోలిన్‌ వోజ్నియాకి వంటి ప్లేయర్లతో టోర్నీ సందడిగా మారనుంది.

Story first published: Saturday, December 21, 2019, 14:48 [IST]
Other articles published on Dec 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X