హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ క్వార్టర్స్‌లో ఓడిపోయింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో సెరెనా విలియమ్స్ 4-6, 6-4, 5-7 తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగెట్టింది.
న్యూజిలాండ్‌తో తొలి వన్డే: టీమిండియా విజయ లక్ష్యం 158
రెండు గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో చివరకు ప్లెస్కోవానే పైచేయి సాధించింది. తొలి సెట్ కోల్పోయిన సెరెనా అనూహ్యంగా పుంజుకుని రెండో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక, మూడో సెట్ నువ్వా నేనా అన్నట్లు సాగినప్పటికీ... ప్లెస్కోవానే చివరకు విజయం సాధంచింది.
ఈ ఓటమితో 24వ గ్రాండ్ స్లామ్ నెగ్గాలని భావించిన సెరెనా ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు సెరెనా-ప్లిస్కోవా ముఖాముఖి రికార్డు 2-2గా నమోదైంది. 2016 యూఎస్ ఓపెన్ సెమీస్‌లో కూడా ప్లిస్కోవా చేతిలో సెరెనా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.