న్యూజిలాండ్‌తో తొలి వన్డే: టీమిండియా విజయ లక్ష్యం 158

హైదరాబాద్: న్యూజిలాండ్ పర్యటనని టీమిండియా ఘనంగా ఆరంభించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్ వేదికగా మెక్‌లీన్ పార్క్ స్టేడియంలో భారత బౌలర్ల విజృంభణతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 38 ఓవర్లలోనే 157 పరుగులకే ఆలౌటైంది.
కివీస్ జట్టులో కేన్ విలియమ్సన్ (64: 81 బంతుల్లో 7 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (5) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ 34వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచి కివీస్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లు తీయగా, షమీ 3, చాహల్ 2, జాదవ్ ఒక వికెట్ తీశాడు.

టాస్ గెలిచిన న్యూజిలాండ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ మార్టిన్ గప్తిల్ని ఔట్ చేశాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో మరో ఓపెనర్ కొలిన్ మున్రో(8)ని ఔట్ చేసి ఆ జట్టుకి ఊహించని షాకిచ్చాడు. ఇద్దరూ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్తున్న బంతిని వెంటాడే ప్రయత్నంలో బౌల్డయ్యారు.

ఐదు ఓవర్లలోపే
దీంతో తొలి ఐదు ఓవర్లలోపే ఆతిథ్య జట్టు ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజులో నిలదొక్కుకున్నాడు. రాస్ టేలర్‌తో కలిసి స్కోరు బోర్డును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని చాహల్ వీడదీశాడు. చాహల్ వేసిన 15వ ఓవర్‌లో టేలర్ అతనికే క్యాచ్ వెనుదిరిగాడు.

విలియమ్సన్ హాఫ్ సెంచరీ
అనంతరం క్రీజులోకి వచ్చిన లాథమ్‌ను కూడా చహల్ క్రీజులో ఎక్కువసేపు నిలువనీయలేదు. లాథమ్ కూడా చహల్ బౌలింగ్‌లోనే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓ వైపు వరసుగా వికెట్లు పడుతున్నా.. మరోవైపు కివీస్ సారథి విలియమ్సన్ ఒంటరి పోరాటం చేశాడు. తనదైన క్లాస్ షాట్‌లతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే వన్డే కెరీర్‌లో 36వ హాఫ్ సెంచరీ సాధించాడు.

కుల్దీప్ యాదవ్ సూపర్ క్యాచ్
కేదార్ జాదవ్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ కళ్లు చెదిరేరీతిలో డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడంతో కివీస్ బ్యాట్స్‌మన్ నికోలస్(12) పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లాథమ్, నికోలస్, శాంట్నర్ సైతం తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. విలియమ్సన్(64). రాస్ టేలర్(24) మినహా కివీస్ ఆటగాళ్లు ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. దీంతో 38 ఓవర్లలో న్యూజిలాండ్ 157 పరుగులకే ఇన్నింగ్స్‌ను ముగించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications