న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనం: ఫెదరర్‌కు షాకిచ్చిన 20 ఏళ్ల సిట్సిపాస్‌

Australian Open: Inspired Stefanos Tsitsipas dethrones defending champion Roger Federer

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఏడో రోజు అతిపెద్ద సంచలనాలు నమోదయ్యాయి. హోరాహోరీ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఫెదరర్‌కు షాకిస్తూ గ్రీస్‌ కుర్రాడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్‌లో తొలిసారి టోర్నీ ఆడుతున్న అన్‌సీడెడ్ చేతిలో ప్రపంచ రెండో ర్యాంకర్ కెర్బర్ ఓడగా... షరపోవా కూడా ఇంటిముఖం పట్టింది.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో హ్యాట్రిక్‌తో కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాలనుకున్న రోజర్ ఫెదరర్‌ ఆశ నెరవేరలేదు. నాలుగో రౌండ్లోనే ఫెదరర్ పోరాటం ముగిసింది. తొలి మూడు రౌండ్‌లలో అలవోకగా ప్రత్యర్థుల ఆట కట్టించిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాత్రం మట్టికరిచాడు. తన అనుభవమంత (21 ఏళ్లు) వయసు లేని 20 ఏళ్ల గ్రీస్‌ కుర్రాడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ చేతిలో ఫెదరర్‌ ఓటమిపాలయ్యాడు.

రికార్డు స్థాయిలో

రికార్డు స్థాయిలో

వరుసగా మూడోసారి... రికార్డు స్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన రోజర్ ఫెదరర్‌కు తన కెరీర్‌లో కేవలం ఆరో గ్రాండ్‌స్లామ్‌ ఆడుతోన్న సిట్సిపాస్‌ ఊహించని షాకిచ్చాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 14వ సీడ్‌ సిట్సిపాస్‌ 6-7 (11/13), 7-6 (7/3), 7-5, 7-6 (7/5)తో మూడో సీడ్‌ ఫెడరర్‌పై గెలిచాడు.

తొలి గ్రీకు ఆటగాడిగా

ఫలితంగా ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన తొలి గ్రీకు ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించడానికి ఫెదరర్‌కు చాలా అవకాశాలే వచ్చాయి. 12 బ్రేక్‌ పాయింట్‌ అవకాశాలు రాగా అన్నింటినీ వృథా చేశాడు. అద్భుతంగా ఫోర్‌హ్యాండ్‌ షాట్లు ఆడే ఫెదరర్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం లయ తప్పాడు. కీలక సమయాల్లో పేలవ ఫోర్‌హ్యాండ్‌ షాట్లు ఆడాడు.

సిట్సిపాస్‌ 20 ఏస్‌లు కొట్టగా

సిట్సిపాస్‌ 20 ఏస్‌లు కొట్టగా

ఈ మ్యాచ్‌లో సిట్సిపాస్‌ 20 ఏస్‌లు కొట్టగా.. ఫెదరర్‌ 12 ఏస్‌లు సంధించాడు. అంతేకాదు కేవలం ఒక డబుల్‌ ఫాల్ట్‌ మాత్రమే చేశాడు. మరోవైపు ఫెదరర్‌ 12 ఏస్‌లు కొట్టినా... 12 బ్రేక్‌ పాయింట్‌ అవకాశాల్లో ఒక్కటీ సద్వినియోగం చేసుకోకపోవడం గమనార్హం. 55 అనవసర తప్పిదాలు చేసిన ఫెదరర్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు.

నా కల నిజమైంది

మ్యాచ్ అనంతరం సిట్సిపాస్‌ మాట్లాడుతూ "ఈ అనుభూతిని చెప్పడానికి నా వద్ద మాటలు లేవు. ఈ భూమి మీద ఇప్పుడు అందరికన్నా సంతోషంగా ఉన్నది నేనే. నాకు ఆరేళ్లు ఉన్నప్పటి నుంచి ఫెడరర్‌ను ఆరాధిస్తున్నాను. మరో దిగ్గజం రాడ్‌ లేవర్‌ పేరిట ఉన్న సెంటర్‌ కోర్టులోనే ఫెదరర్‌తో ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైంది. ఈ ఫలితాన్ని ఎలా వర్ణించాలో కూడా మాటలు రావడంలేదు" అని సిట్సిపాస్‌ అన్నాడు.

ఫెదరర్ మాట్లాడుతూ

ఫెదరర్ మాట్లాడుతూ

మరోవైపు ఫెదరర్ మాట్లాడుతూ "నేను మంచి ప్లేయర్‌ చేతిలోనే ఓడిపోయాను. ఇటీవల కాలంలో సిట్సిపాస్‌ చాలా బాగా ఆడుతున్నాడు. కీలక సమయాల్లో అతను ఎంతో ఓర్పుతో ఆడాడు" అని ఫెదరర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. మరోవైపు రెండో సీడ్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) క్వార్టర్స్‌ చేరుకున్నాడు. నాలుగో రౌండ్లో నాదల్ 6-0, 6-1, 7-6 (7-4)తో బెర్డిచ్‌ (చెక్‌)ను ఓడించాడు.

క్వార్టర్‌కు చేరిన రఫెల్ నాదల్

క్వార్టర్‌కు చేరిన రఫెల్ నాదల్

రఫెల్ నాదల్‌ క్వార్టర్‌ ఫైనల్లో అమెరికా సంచలన ఆటగాడు ఫ్రాన్సిస్‌ టియోఫోతో తలపడతాడు. హోరాహోరీగా జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 20 ఏళ్ల టియోఫో 7-5, 7-6 (8-6), 6-7 (1-7), 7-5తో గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై విజయం సాధించాడు. టియోఫో నుంచి నాదల్‌కు గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు. వీరిద్దరూ ఇంతకుముందు ఎప్పుడూ తలపడపోవడం విశేషం.

కెర్బర్, షరపోవా ఓటమి

కెర్బర్, షరపోవా ఓటమి

మహిళల సింగిల్స్‌‌లో మాజీ నంబర్‌వన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ)కు అనూహ్య ఓటమి ఎదురైంది. తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడుతోన్న 25 ఏళ్ల అమెరికా అమ్మాయి డానియెలా కొలిన్స్‌ 6-0, 6-2తో కెర్బర్‌ను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో 15వ ర్యాంకర్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 4-6, 6-1, 6-4తో 30వ సీడ్, 2008 చాంపియన్, మాజీ నంబర్‌వన్‌ మరియా షరపోవా (రష్యా)ను బోల్తా కొట్టించి తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.

Story first published: Monday, January 21, 2019, 9:59 [IST]
Other articles published on Jan 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X