న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australian open 2022: సానియా జోడీ ఔట్.. క్వార్టర్ ఫైనల్లో ఓటమి!

Sania Mirza crashes out of

మెల్‌బోర్న్: సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఇండియా లెజెండ్ సానియా మీర్జా కథ ముగిసింది. అమెరికా టెన్నీస్ ప్లేయర్ రాజీవ్ రామ్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలోకి దిగిన హైదరాబాద్ స్టార్.. క్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. మంగళవారం జరిగిన మిక్స్​డ్ డబుల్స్ క్వార్టర్​ఫైనల్లో అన్‌సీడెడ్ సానియా-రామ్ 4-6, 6-7 తేడాతో జాసోన్ కుబ్లర్, జమీ ఫోర్లిస్ ఆస్ట్రేలియా మిక్స్‌డ్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్‌లో దారుణంగా విఫలమైన సానియా జోడీ.. రెండో సెట్‌లో పుంజుకున్నా పై చేయి సాధించలేకపోయింది.

ఆదివారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లోసానియా-రాజీవ్‌ ద్వయం 7-6 (8/6), 6-4తో ఎలెన్‌ పెరెజ్‌-మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీపై గెలిచింది. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా-రాజీవ్‌ రామ్‌ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి తమ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది.

డబుల్స్‌లో ఉక్రెయిన్ ప్లేయర్ నదియా కిచ్నోక్‌తో జోడీ కట్టిన సానియా తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైంది. స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్‌సెక్‌-కాజా జువాన్‌ జోడీ 4-6, 6-7(5) చేతిలో సానియా ద్వయం ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం తనకు ఇదే చివరి సీజన్ అని, అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని ఈ హైదరాబాద్ స్టార్ ప్రకటించింది.

T20 World Cup: Sania Mirza On Pakistan-India Match | Oneindia Telugu

ఈ ఓటమి తర్వాతే సానియా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. 'ఇదే నా చివరి సీజన్ అని నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్నా. ఈ సీజన్ మొత్తం ఆడగలనో లేదో తెలియదు. కానీ నేను మొత్తం సీజన్‌లో ఉండాలనుకుంటున్నాను" అని సానియా తెలిపింది. దాంతో తన కెరీర్‌లో చివరి ఆస్ట్రేలియా ఓపెన్ ఆడిన సానియా.. నిరాశగా వెనుదిరిగినట్లు అయింది.

Story first published: Tuesday, January 25, 2022, 14:48 [IST]
Other articles published on Jan 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X