న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australia Open 2022: జకోవిచ్‌కు కరోనా! అందుకే ప్రత్యేక మినహాయింపు..

Australia Open 2022: Novak Djokovic was granted vaccine exemption after testing positive for Covid-19 in December

సిడ్నీ: ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ 2022లో పాల్గొనేందుకు మెల్‌బోర్న్ చేరిన వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌ను వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోని కారణంగా అక్కడి అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దాంతో అతను న్యాయపోరాటానికి దిగాడు. నోవాక్‌ జకోవిచ్‌ డిసెంబర్​లో కరోనా వైరస్ బారిన పడినట్లు అతని తరఫు లాయర్లు శనివారం మెల్‌బోర్న్‌లోని ఫెడరల్‌ కోర్టుకు విన్నవించారు. అందువల్లే అతడికి 'ఆస్ట్రేలియా ఓపెన్‌'లో పాల్గొనడానికి నిర్వాహకులు వైద్యపరమైన ప్రత్యేక మినహాయింపు ఇచ్చారని తెలిపారు.

జకోవిచ్‌ 'ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌'లో పాల్గొనేందుకు మూడు రోజుల క్రితం మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతనికి సరైన వీసా అనుమతులు, వైద్యపరమైన మినహాయింపులున్నా.. వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు అడ్డుకున్నారు. జకోవిచ్‌ వీసాను రద్దు చేసి డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచారు. ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారగా.. అక్కడే ఉన్న జకోవిచ్‌ ఆస్ట్రేలియా తీరుపై న్యాయపోరాటం చేసేందుకు సిద్దమయ్యాడు.

ఈ క్రమంలోనే శనివారం తన లాయర్ల ద్వారా జకోవిచ్ కోర్టులో వాదనలు వినిపించాడు. అలాగే ఇప్పుడు అతను ఉంటున్న డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి తరలించాలని, ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు తనకు అనుమతివ్వాలని కోరాడు. వీసా రద్దును కూడా తొలగించాలన్నాడు. ఇప్పుడు తనకు ప్రాక్టీస్‌ చేసుకునే వీలు కల్పించాలని కూడా ఈ సెర్బియా స్టార్ ఆటగాడు అభ్యర్థించాడు. కాగా, జకోవిచ్‌ ఉంటున్న ప్రదేశంలో పలువురు సెర్బియన్‌ పౌరులు నిరసన తెలిపారు. అతని ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేలా చూడాలని కోరుతున్నారు.

Story first published: Saturday, January 8, 2022, 18:21 [IST]
Other articles published on Jan 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X