న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ATP Rankings: 100వ టైటిల్‌తో టాప్-4లోకి రోజర్ ఫెదరర్

ATP Rankings: Roger Federer hits top-4 again. Tsitsipas cracks top-10

హైదరాబాద్: కెరీర్‌లో 100వ సింగిల్స్ టైటిల్‌ను సాధించిన స్విస్ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ తన ర్యాంకుని మరింతగా మెరుగుపరచుకున్నాడు. సోమవారం ఏటీపీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోజర్ ఫెదరర్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జోకోవిచ్ నంబర్ వన్ ర్యాంకుని అందుకుని 24 వారాలు గడిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన అనంతరం నొవాకో జొకోవిచ్ నంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

వందో సింగిల్స్‌ టైటిల్‌ సాధించిన ఫెదరర్

ఇదిలా ఉంటే, శనివారం రోజర్ ఫెదరర్ తన కెరీర్‌లో వందో సింగిల్స్‌ టైటిల్‌ సాధించిన సంగతి తెలిసిందే. దుబాయి టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో గ్రీస్‌ ఆటగాడు సిట్సిపాస్‌ను ఓడించడం ద్వారా పెదరర్ ఘనతను అందుకున్నాడు. ఫైనల్లో ఫెడరర్‌ 6-4, 6-4తో ప్రపంచ పదో ర్యాంకర్‌ సిట్సిపాస్‌ను అలవోకగా ఓడించాడు.

ఎనిమిదోసారి సొంతం చేసుకున్న ఫెదరర్

ఫలితంగా దుబాయి టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌‌ను టైటిల్‌ను ఎనిమిదోసారి సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో కెరీర్‌ వందో టైటిల్‌ రికార్డునూ అందుకున్నాడు. అమెరికా టెన్నిస్‌ గ్రేట్‌ జిమ్మీ కానర్స్‌ (109 టైటిల్స్‌) తర్వాత అరుదైన 100 టైటిళ్లు అందుకున్న రెండో ఆటగాడిగా ఫెదరర్ అరుదైన ఘనత సాధించాడు.

2003 నుంచి 2009 వరకు

2003 నుంచి 2009 ఫెదరర్‌ కెరీర్‌ అత్యద్భుతంగా సాగింది. ఈ ఆరేళ్లలో ఫెదరర్ 121 టోర్నీలు ఆడి 57 టైటిళ్లు ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 15 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు కూడా ఉన్నాయి. 2004, 05, 06 సీజన్లలో అయితే అతను దాదాపు ఆడిన అన్ని టోర్నీల్లోనూ విజేతగా నిలిచాడు.

ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా

అందులో 12 సందర్భాల్లో ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. 2006 నాటికల్లా ఫెదరర్ ఖాతాలో 10 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు చేరాయి. అయితే మరో 10 టైటిళ్లు కొట్టడానికి అతనికి 13 ఏళ్ల సమయం పట్టింది. ఇందుకు కారణం రఫెల్‌ నాదల్‌, నొవాక్‌ జొకోవిచ్‌, ఆండీ ముర్రే లాంటి ఆటగాళ్లు రావడమే.

తొలి టైటిల్‌ మిలన్‌లో గెలిచా: ఫెదరర్

తొలి టైటిల్‌ మిలన్‌లో గెలిచా: ఫెదరర్

ఫైనల్లో తొలి సెట్‌ కోల్పోయినా ఫెదరర్‌ గెలిచిన ట్రోఫీలు 15. ఫైనల్లో ఫెదరర్‌తో తలపడిన ప్రత్యర్థుల్లో రిటైరైన వాళ్ల సంఖ్య ఇప్పటివరకు 25గా ఉంది. దుబాయి టైటిల్ అనంతరం ఫెదరర్ మాట్లాడుతూ "వంద టైటిళ్లు గెలవడం ఒక కలలా ఉంది. తొలి టైటిల్‌ మిలన్‌లో గెలిచా.. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నా. ఆటలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. ఇంకా ఇలా ఎంత కాలం కొనసాగుతానో చూడాలి. ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నా. ఎంతో మద్దతుగా నిలుస్తున్న నా కుటుంబానికి, సపోర్టింగ్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు. రికార్డులు బద్దలు కొట్టేందుకు ఆడట్లేదు. కానర్స్‌ సాధించిన అత్యధిక టైటిళ్ల రికార్డు నమ్మశక్యంగా లేదు" అని అన్నాడు.

Story first published: Monday, March 4, 2019, 17:18 [IST]
Other articles published on Mar 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X