న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆండీ ముర్రేకు శస్త్రచికిత్స: 2019 వింబుల్డన్ కోసమేనా!

Andy Murray undergoes hip resurfacing surgery in London

హైదరాబాద్: బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్, వింబుల్డన్‌ మాజీ చాంపియన్‌ ఆండీ ముర్రే సోమవారం తుంటి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. చాలా రోజులుగా ఆండీ ముర్రే తుంటి ఎముక గాయంతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. తుంటి వద్ద ఎముకను సరిచేస్తూ మెటల్ ప్లేట్‌ను అమర్చారని ప్లేయర్ తెలిపాడు.

ప్రస్తుతం నొప్పి నుంచి కోలుకుంటున్నానని, త్వరలోనే ఈ గాయం సమస్య పూర్తిగా తొలిగిపోతుందని అన్నాడు. "లండన్‌లో సోమవారం జరిగిన శస్త్రచికిత్సతో కొంత ఉపశమనం పొందా. సమస్య నుంచి ఇది గట్టెక్కిస్తుందని ఆశిస్తున్నాం"అంటూ అతడు ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశాడు.

దీంతో పాటు కుడి తొడ ఫీమర్‌ ఎముకకు మెటల్‌ క్యాప్‌ ఉన్న ఎక్స్‌రేను కూడా పోస్టు చేశాడు. గత ఏడాదిలో ముర్రే తుంటికి శస్త్రచికిత్స జరగడం ఇది రెండోసారి. గత ఏడాది జనవరిలో మర్రే ఒకసారి శస్త్ర చికిత్స జరిగింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన ముర్రే గాయం కారణంగా 2019 వింబుల్డన్ తర్వాత టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతానని ముర్రే ప్రకటించాడు.

Andy Murray undergoes hip resurfacing surgery in London

అందులో భాగంగానే ఈ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం. అయితే మునుపటి స్థాయిలో టెన్నిస్ ఆడేందుకు ఈ చికిత్స ఎంతమేరకు సహకరిస్తుందనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మైదానంలో ఆడేటప్పుడు నొప్పి మాత్రం ఉండదని శస్త్రచికిత్స చేసిన డాక్టర్ ఎడ్విన్‌సు వెల్లడించారు.

Story first published: Wednesday, January 30, 2019, 10:27 [IST]
Other articles published on Jan 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X