న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Alize Cornet: పట్టు వీడని పోరాటం.. 17 ఏళ్ల తర్వాత క్వార్టర్స్ చేరిన ఫ్రాన్స్ టెన్నిస్ బ్యూటీ!

Alize Cornet beat Simona Halep in Australian Open Pre-Quarters

మెల్‌బోర్న్‌: ఈ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌లో ఏ మాత్రం అంచనాలు లేని కనెపి (ఈస్తోనియా), కార్నెట్‌ (ఫ్రాన్స్‌) ఏకంగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. వరల్డ్ మాజీ నంబర్ వన్ సిమోనా హలెప్, రెండో సీడ్ సబలెంకలకు షాకిచ్చారు. ఏళ్ల తరబడి టెన్నిస్‌ ఆడుతున్నా అందరి కళ్లలో పడని ఫ్రాన్స్‌ స్టార్‌ అలిజె కార్నెట్‌. ఇప్పుడు ఒక్క ప్రిక్వార్టర్స్‌ విజయంతో పతాక శీర్షికల్లో నిలిచింది.

15 ఏళ్ల ప్రాయంలో 2005 నుంచి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడుతున్న 32 ఏళ్ల ఈ ఫ్రాన్స్‌ స్టార్‌ గతంలో ఎప్పుడూ ప్రిక్వార్టర్స్‌ దశనే దాటలేకపోయింది. ఇప్పుడైతే ఏకంగా రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్, 14వ సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)ను కంగుతినిపించి మరీ క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

మాజీ నంబర్‌వన్‌కు చుక్కలు..

మాజీ నంబర్‌వన్‌కు చుక్కలు..

సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో కార్నెట్‌ 6-4, 3-6, 6-4తో హలెప్‌పై విజయం సాధించి తన 63వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. రెండో రౌండ్లో మూడో సీడ్‌ ముగురుజాను ఓడించిన కార్నెట్‌.. ప్రి క్వార్టర్స్‌లో అదే జోరును కొనసాగించింది. తొలి సెట్‌ నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన కార్నెట్‌ 3-1తో ఆధిక్యం సాధించింది. మధ్యలో హలెప్‌ పోరాడినా.. కార్నెట్‌ ఆ సెట్‌ దక్కించుకుంది. రెండో సెట్‌ ఆరంభంలోనూ ఆమెదే దూకుడు. కానీ పుంజుకున్న హలెప్‌ వరుసగా అయిదు గేమ్‌లు గెలిచి సెట్‌ సొంతం చేసుకుంది. ఇలాగే సాగిన మూడో సెట్లో కార్నెట్‌ పైచేయి సాధించింది.

సబలెంకకు షాక్..

సబలెంకకు షాక్..

మరో మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో కనెపి 5-7, 6-2, 7-6 (10-7) తేడాతో రెండో సీడ్‌ సబలెంక (బెలారస్‌)పై విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 115వ స్థానంలో ఉన్న కనెపి తొలి సెట్లో గొప్పగా ప్రతిఘటించింది. ఏస్‌లు, విన్నర్లతో చెలరేగిన ఇద్దరు క్రీడాకారిణులు ఓ దశలో 5-5తో నిలిచారు. ఆ సమయంలో తన సర్వీస్‌ నిలబెట్టుకోవడంతో పాటు తర్వాతి గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సబలెంక తొలి సెట్‌ దక్కించుకుంది. కానీ అద్భుతంగా పుంజుకున్న కనెపి రెండో సెట్‌ను ఏకపక్షంగా మార్చేసింది.

నిర్ణయాత్మక మూడో సెట్లోనూ ఓ దశలో కనెపి 4-2తో ఆధిక్యంలో నిలిచింది. కానీ వరుసగా రెండు గేమ్‌లు గెలిచిన సబలెంక 4-4తో స్కోరు సమం చేసింది. మ్యాచ్‌ పాయింట్‌ను కాపాడుకున్న కనెపి పోరును టైబ్రేకర్‌కు మళ్లించింది. అందులోనూ ఇద్దరు నువ్వానేనా అన్నట్లుగా తలపడ్డారు. కీలక సమయంలో పైచేయి సాధించిన కనెపి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఆమె 5 ఏస్‌లు, 30 విన్నర్లు కొట్టింది.

శ్రమించిన మెద్వెదెవ్‌

శ్రమించిన మెద్వెదెవ్‌

పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా)కు అసాధారణ ప్రతిఘటన ఎదురైంది. 3 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్‌ 6-2, 7-6 (7/4), 6-7 (4/7), 7-5తో 70వ ర్యాంకర్‌ మ్యాక్సిమ్‌ క్రెస్సీ (అమెరికా)పై గెలిచాడు. ఇతర ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) 4-6, 6-4, 4-6, 6-3, 6-4తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై, 11వ సీడ్‌ సినెర్‌ (ఇటలీ) 7-6 (7/3), 6-3, 6-4తో డి మినార్‌ (ఆస్ట్రేలియా)పై, తొమ్మిదో సీడ్‌ అలియాసిమ్‌ (కెనడా) 2-6, 7-6 (9/7), 6-2, 7-6 (7/4)తో సిలిచ్‌ (క్రొయేషియా)పై నెగ్గారు.

Story first published: Tuesday, January 25, 2022, 10:08 [IST]
Other articles published on Jan 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X