'అతని వల్లనే గర్భవతినయ్యా.. బిడ్డకు జన్మనివ్వబోతున్నా'

హాంబర్గ్‌: అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌.. ఈ పేరు తెలియని టెన్నిస్ అభిమాని ఉండడు. 23 ఏళ్ల ఈ జర్మనీ టెన్నిస్‌ ఆటగాడు సంచలన ప్రదర్శనలతో టాప్ స్టార్లను కూడా ఓడించాడు. జ్వెరెవ్‌ ఇటీవలే కొలోన్లో రెండు ఎటిపి టైటిల్స్ కూడా గెలుచుకున్నాడు. వారం వ్యవధిలోనే రెండు టైటిల్స్ సాధించడం విశేషం. అంతకుముందు న్యూయార్క్‌లో జరిగిన యుఎస్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి వార్తల్లోకి ఎక్కాడు. అప్పుడు ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్ చేతిలో ఓడిపోయాడు. తాజాగా జ్వెరెవ్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు.

 27ఏళ్ల యువతితో సహజీవనం

27ఏళ్ల యువతితో సహజీవనం

23 ఏళ్ల వయసులోనే అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ తండ్రి కాబోతున్నాడా అంటే?.. అతని మాజీ ప్రేయసి బ్రెండా పాటియా వ్యాఖ్యల ప్రకారం అది నిజమేనని తెలుస్తోంది. తనకంటే రెండేళ్లు పెద్దదయిన బ్రెండా (27 ఏళ్లు)తో జ్వెరేన్ ఏడాది పాటు సహజీవనం చేశాడు. ఇద్దరి మధ్య అభిప్రాయాలు కలవకపోవడంతో ఈ ఏడాది ఆగస్టులో విడిపోయారు. అయితే తాను గర్భంతో ఉన్నానని, దానికి కారణం జ్వెరెవ్‌ అని తాజాగా గాలాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెండా తెలిపారు.

జ్వెరెవ్‌ కారణంగానే బిడ్డకు జన్మనివ్వబోతున్నా

జ్వెరెవ్‌ కారణంగానే బిడ్డకు జన్మనివ్వబోతున్నా

తాజాగా గాలాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెండా పాటియా మాట్లాడుతూ... 'జ్వెరెవ్‌తో ఏడాది పాటు సహజీవనం చేశా. నేనిప్పుడు 20 వారాల గర్భవతిని. జ్వెరెవ్‌ కారణంగానే బిడ్డకు జన్మనివ్వబోతున్నా. జీవితంపై మాకు విభిన్న ఆలోచనలు ఉండడంతో కలిసి ఉండలేక విడిపోయాం. పుట్టబోయే బిడ్డను అతని దగ్గర ఉంచను. సొంతంగా బిడ్డ బాధ్యతను చూసుకునే స్థాయిలో ఉండడం నా అదృష్టం' అని పేర్కొన్నారు. బ్రెండా వ్యాఖ్యలపై జ్వెరెవ్‌ ఇంకా స్పందించలేదు.

ఫైనల్‌కు చేరుకున్న మొదటి జర్మన్ ఆట‌గాడు

ఫైనల్‌కు చేరుకున్న మొదటి జర్మన్ ఆట‌గాడు

అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఈ ఏడాది యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్ ఆడిన విషయం తెలిసిందే. 1994 త‌ర్వాత యూఎస్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్న మొదటి జర్మన్ ఆట‌గాడిగా అలెగ్జాండర్ జ్వెరెవ్ నిలిచాడు. 1994లో మైఖేల్ స్టిచ్ యూఎస్ ఫైన‌ల్‌లో ఆడాడు. 26 ఏళ్ల త‌ర్వాత జ్వెరెవ్ యూఎస్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్‌ ఆడాడు. అయితే ఫైనల్లో జ్వెరెవ్ ఓటమిపాలయ్యాడు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో డొమినిక్‌ థీమ్‌ 2-6, 4-6, 6-4, 6-3, 7-6 (8-6) తేడాతో జ్వెరెవ్‌పై గెలిచాడు.తొలి రెండు సెట్లను గెలిచి కూడా మ్యాచ్‌ని ఓడిపోవడం జ్వెరెవ్‌కు కెరీర్‌లో ఇదే తొలిసారి.

MI vs RCB: జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. తొలి, వందో వికెట్‌గా విరాట్ కోహ్లీ!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, October 29, 2020, 15:31 [IST]
Other articles published on Oct 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X