న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2021: వ్యూహాలు చెబుతూ.. జకోవిచ్‌కే కోచింగ్‌ ఇచ్చిన కుర్రాడు!!

A little young fans gives coaching to Novak Djokovic in French Open 2021 Final

పారిస్‌: టెన్నిస్ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్, సెర్బియా స్టార్ నొవాక్ జోక‌విచ్‌ ఆదివారం రాత్రి జ‌రిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఫైన‌ల్లో సంచ‌ల‌న విజయం సాధించిన విష‌యం తెలిసిందే. తొలి రెండు సెట్లు ఓడిపోయినా.. త‌ర్వాత వ‌రుస‌గా మూడు సెట్ల‌లో గెలిచి కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్ అందుకున్నాడు. అంతేకాదు ప్ర‌తి గ్రాండ్‌స్లామ్‌ను క‌నీసం రెండు సార్లు గెలిచిన తొలి ప్లేయ‌ర్‌గానూ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే జకోను మ్యాచ్‌ సాంతం వ్యూహాలు చెబుతూ ఓ కుర్రాడు ఉత్సాహ పరిచాడు. ఇందుకు ముచ్చటపడిన జోక‌విచ్‌.. మ్యాచ్ అనంతరం ఆ కుర్రాడికి తన రాకెట్‌ను బహుమతిగా ఇచ్చాడు.

ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ 6-7(6/8),2-6,6-3,6-2,6-4 తో ఐదో సీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపస్‌ (గ్రీస్‌)పై గెలుపొందాడు. 4 గంటలా 11 నిమిషాల పాటు సాగిన పోరులో 34 ఏళ్ల జొకోవిచ్‌ జోరు ముందు 22 ఏళ్ల సిట్సిపస్‌ నిలువలేకపోయాడు. గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో సిట్సిపస్‌పై ఐదు సెట్‌ల పాటు పోరాడి నెగ్గిన జకో.. ఈ సారి కూడా మొదటి రెండు సెట్‌లు కోల్పోయి ఒత్తిడిలో కూరుకుపోయాడు. అయితే తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ బరిలో నిలిచిన సిట్సిపస్‌.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోలేకపోయాడు. అనవసర తప్పిదాలతో జకోకు కోలుకునే అవకాశం ఇచ్చాడు. వెనుదిరిగి చూసుకోని జొకోవిచ్‌.. వరుసగా మూడు సెట్‌లు నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

మ్యాచ్‌ సాంతం స్టాండ్స్‌లోని ఓ కుర్రాడు తనకెంతో మద్దతుగా నిలిచాడని నొవాక్‌ జొకోవిచ్‌ తెలిపాడు. కోచింగ్‌ ఇస్తూ, వ్యూహాలు చెబుతూ తనలో ప్రేరణ నింపినట్టుగా అనిపించిందని పేర్కొన్నాడు. 'మ్యాచ్‌ పూర్తయ్యేంత వరకు అతడి మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. నేను వరుసగా రెండు సెట్లు ఓడినప్పుడు నన్ను ప్రోత్సహించాడు. నిజానికి అతడు కొన్ని వ్యూహాలు చెప్పాడు. సర్వీస్‌ నిలబెట్టుకో, తొలి బంతిని సులభంగా ఆడు, ఆ తర్వాత ఆధిపత్యం వహించు, సిట్సిపాస్‌కు బ్యాక్‌హాండ్‌ ఇవ్వు అంటూ పదేపదే చెప్పాడు. ఇది నాకు ముద్దుగా అనిపించింది. అందుకే మ్యాచ్‌ తర్వాత రాకెట్‌ ఇచ్చేందుకు అతడే అర్హుడని అనిపించింది. నాకు మద్దతిచ్చినందుకు అతడి పట్ల కృతజ్ఞత చాటుకున్నా' అని జకోవిచ్‌ చెప్పాడు. రాకెట్‌ అందుకోగానే ఆ కుర్రాడు ఆనందంతో ఎగిరి గంతులేశాడు.

PSL 2021: గాయం నుంచి కోలుకుంటున్నా.. కానీ జ‌రిగిందేంటో మ‌ర‌చిపోయా: స్టార్ క్రికెట‌ర్‌PSL 2021: గాయం నుంచి కోలుకుంటున్నా.. కానీ జ‌రిగిందేంటో మ‌ర‌చిపోయా: స్టార్ క్రికెట‌ర్‌

మ్యాచ్‌కు ముందు జ‌రిగిన ఓ విషాదాన్నిస్టెఫానోస్ సిట్సిపాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. త‌న‌కెంతో ఇష్ట‌మైన నాన్న‌మ్మ చనిపోయిందని, ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందే త‌న‌కు ఈ విషయం తెలిసిందని చెప్పాడు. త‌న నాన్న‌మ్మలాంటి వ్య‌క్తిని తాను ఇప్ప‌టి వ‌ర‌కూ చూడ‌లేద‌న్నాడు. నాన్నమ్మ తననెప్పుడూ ఉల్లాసంగా ఉంచేందుకు ప్రయత్నించేదని, ఆమె లాంటి వ్య‌క్తులు క‌ల‌లు క‌న‌డం నేర్పిస్తార‌ని సిట్సిపాస్ తెలిపాడు. జీవితంలో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని.. ప్ర‌తి క్ష‌ణాన్ని ఆస్వాదించామా లేదా అన్న‌దే ముఖ్య‌మ‌ని అతడు అభిప్రాయ‌ప‌డ్డాడు.

Story first published: Monday, June 14, 2021, 18:01 [IST]
Other articles published on Jun 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X