న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సానియా మిర్జాకు పీటీ ఉషకు తేడా తెలియదా?: విశాఖ బీచ్‌రోడ్‌లో ఫోటో వైరల్

 YSR kreeda protasahakalu - Instead of sania mirza they are saying it as PT Usha

హైదరాబాద్: పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాకాలు అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న నగదు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు.

కశ్మీరీలకు సంఘీభావం.. పాక్ ఆర్మీ నిరసనలో షాహిద్ అఫ్రిది!!కశ్మీరీలకు సంఘీభావం.. పాక్ ఆర్మీ నిరసనలో షాహిద్ అఫ్రిది!!

ఈ క్రమంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం బీచ్ రోడ్డులో వెలిసిన ఓ పోస్టర్ మన రాజకీయ నాయకుల క్రీడా పరిజ్ఞానానికి అద్దం పడుతోంది. సాధారణంగా మన దేశంలో రాజకీయ నాయకులకు క్రీడల్లో పరిజ్ఞానం కొంచెం తక్కువగానే ఉంటుంది. మన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించినప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి వారి పేరిట కొన్ని పోస్టుర్లు వెలుస్తుంటాయి.

ప్రజల దృష్టిని ఆకర్షించడం

ప్రజల దృష్టిని ఆకర్షించడం

ప్రజల దృష్టిని ఆకర్షించడం ఏమో గానీ ఆయా పోస్టర్ల కారణంగా చిన్నపాటి తప్పులతో వారు అభాసుపాలవుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే విశాఖపట్నంలో చోటు చేసుకుంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సహాకాలు పేరిట

ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సహాకాలు పేరిట నజరానాలు అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో విశాఖ రామకృష్ణ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్టర్‌లో నిర్వాహకులు సానియా మిర్జా ఫోటోని పోస్టు చేసిన దాని కింద పిటి ఉష అంటూ ముద్రించారు.

సానియా మిర్జా ఫోటో కింద పీటీ ఉష పేరు

సానియా మిర్జా ఫోటో కింద పీటీ ఉష పేరు

అంతేకాదు ఆమెకు పద్మభూషన్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత అంటూ ఆ పోస్టర్‌పై ముద్రించారు. ఈ పోస్టర్‌లో సానియా మిర్జా ఫోటోని ముద్రించి పీటీ ఉషగా పేరు రాయడం పెద్ద తప్పిదం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరీ ఇంత నాలెడ్జి

ఒక నెటిజన్ అయితే "మరీ ఇంత నాలెడ్జి ఉన్న వీళ్ళను మనం తట్టుకోవాలంటే చాలా కష్టం. సానియా మీర్జాకు, P. T. ఉష కు తేడా తెలియని వీళ్ళు మన పాలకులు మన ఖర్మ" అంటూ కామెంట్ చేయగా.... మరొక నెటిజన్ "అర్ధ చదువుల ప్రభుత్వం" అంటూ మండిపడ్డాడు.

సానియా మిర్జా పేరు సడన్‌గా పీటీ ఉషగా

ఇంకొక నెటిజన్ "సానియా మిర్జా పేరు సడన్‌గా పీటీ ఉషగా మారింది. ఏమైంద సడన్‌గా" అంటూ కామెంట్ పోస్టు చేశాడు. ఈ పోటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Story first published: Thursday, August 29, 2019, 13:39 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X