న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూత్ ఒలింపిక్స్: స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జెరెమీ

Youth Olympics: Jeremy Lalrinnunga wins Indias first-ever individual weightlifting Gold

హైదరాబాద్: అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌ వేదికగా జరుగుతున్న యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ టీనేజ్‌ వెయిట్‌ లిఫ్టర్ జెరెమీ లాల్రిన్నుగయా స్వర్ణ పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో 15 ఏళ్ల జెరెమీ ఫైనల్‌ అటెంప్ట్‌లో 150 కేజీల బరువు ఎత్తడం ద్వారా స్వర్ణం పతకం సాధించాడు.

62 కేజీల విభాగంలో పోటీపడ్డ

గ్రూప్‌-ఎలో భాగంగా 62 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ యువ వెయిట్‌లిఫ్టర్‌.. మొత్తంగా 274 కేజీల బరువు ఎత్తి భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. తొలుత స్నాచ్‌ విభాగంలో అత్యధికంగా 124 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన జెరెమీ.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో అత్యధికంగా 150కేజీలను ఎత్తాడు.

యూత్‌ ఒలింపిక్స్‌లో ఇదే భారత్‌కు తొలి స్వర్ణం

తద్వారా టర్కీ వెయిట్‌లిఫ్టర్‌ తొప్తాస్‌ కానర్‌(263 కేజీలు)లను అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. దీంతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా, మొత్తంగా యూత్‌ ఒలింపిక్స్‌లో ఇదే భారత్‌కు తొలి స్వర్ణం కావడం విశేషం. దాంతో యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో తొలి స్వర్ణం వచ్చి చేరింది.

తాజా స్వర్ణంతో సరికొత్త చరిత్ర సృష్టించిన జెరెమీ

తాజా స్వర్ణంతో సరికొత్త చరిత్ర సృష్టించిన జెరెమీ

తాజాగా స్వర్ణం చేరడంతో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. మూడో యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ పసిడితో స్వర్ణ ఖాతాను తెరిచింది. ఇప‍్పటివరకూ ఈ యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఒక గోల్డ్‌ మెడల్‌తో పాటు మూడు రజత పతకాలు సాధించింది. ఇదే భారత్‌కు యూత్‌ ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

 2014లో భారత్ ఖాతాలో కేవలం రెండు పతకాలు మాత్రమే

2014లో భారత్ ఖాతాలో కేవలం రెండు పతకాలు మాత్రమే

2014లో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌ కేవలం రెండు పతకాల్ని మాత్రమే సాధించింది. కాగా, సోమవారం పోటీల్లో భాగంగా షూటింగ్‌ సంచలనం మేహాలి ఘోష్‌ తృటిలో స్వర్ణం చేజార్చుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో 18 ఏళ్ల ఘోష్‌ రజతంతో సరిపెట్టుకుంది. ఆఖరి షాట్‌ మినహా అన్ని షాట్లను లక్ష్యానికి దగ్గరగా గురిపెట్టిన ఆమె చివరి 24వ షాట్‌తో స్వర్ణానికి దూరమైంది.

Story first published: Tuesday, October 9, 2018, 12:06 [IST]
Other articles published on Oct 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X