న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలి రోజే భారత్‌కు రెండో పతకం ఖాయం చేసిన భజరంగ్ పూనియా(వీడియో)

Wrestler Bajrang Punia Assures Another Medal for India on Opening Day

హైదరాబాద్: ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్‌ భజ‌రంగ్‌ పూనియా దూకుడు ప్రదర్శించి ఫైనల్‌కి దూసుకెళ్లాడు. పురుషుల 65 కేజీ సెమీస్‌లో పూనియా.. మంగోలియాకు చెందిన బచులున్‌పై 10-0 తేడాతో అద్భుత విజయం సాధించి భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు క్వార్టర్స్‌లో పూనియా తజకిస్థాన్‌కు చెందిన ఫైజీవ్‌ అబ్దుల్‌ ఖాసిమ్‌పై 12-2 తేడాతో విజయం సాధించాడు.

పురుషుల రెజ్లింగ్‌లో పూనియా ఒక్కడే రాణించగా.. పవన్‌ కుమార్‌, ఖత్రీ మౌసమ్‌ నిరాశ పరిచారు. పురుషుల 97 కేజీ క్వార్టర్స్‌లో ఖత్రీ మౌసమ్‌.. ఉజ్జెకిస్థాన్‌కు చెందిన ఇబ్రాగి మాగోపై 0-8 తేడాతో ఘోర పరాజయం పాలయ్యాడు. మరోవైపు 86 కేజీల విభాగంలో పవన్‌కుమార్‌ కూడా 0-11 తేడాతో ఇరాన్‌కు చెందిన హసన్‌పై ఓడిపోయాడు.

ఇండోనేషియా నగరాలైన జకార్తా, పాలెమ్‌బాంగ్‌లలో జరుగుతున్న 18వ ఏషియన్ గేమ్స్‌లో ఇండియా ఖాతా తెరిచింది. ఆసియా క్రీడల షూటింగ్‌ విభాగంలో భారత షూటర్లు అపూర్వీ చండేలా, రవికుమార్‌ ఫైనల్‌లో విజయం సాధించారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో ఈ జంట మొత్తం 835.3 స్కోరుతో ఫైనల్‌కి చేరి స్వర్ణ పతకంపై ఆశలను పెంచింది.

క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో కొరియా తర్వాత రెండోస్థానంలో నిలిచి ఫైనల్‌కు వెళ్లిన ఇండియన్ జోడీ.. ఫైనల్లోనూ సిల్వర్ మెడల్ గెలిచేలా కనిపించింది. రెండోస్థానం కోసం చైనాతో పోటీ పడింది. ఒకే షాట్ మిగిలి ఉన్న సమయంలో రెండు టీమ్స్ ఒకే స్కోరు సాధించాయి. ఈ సమయంలో చివరి షాట్‌కు ఇండియాకు 9.7 పాయింట్లు మాత్రమే వచ్చాయి. దీంతో చైనా సిల్వర్ మెడల్, చైనీస్ తైపీ గోల్డ్ మెడల్ గెలుచుకోగా.. ఇండియా బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకుంది.

Story first published: Tuesday, August 21, 2018, 15:28 [IST]
Other articles published on Aug 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X