న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ కప్: క్వార్టర్ ఫైనల్‌లో మ్యాచ్ టై లేదా రద్దైతే ఏమవుతుంది..?

By Nageswara Rao

ఐసీసీ వరల్డ్ కప్‌లో లీగ్‌ల సమరం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఏయే జట్లు అర్హత సాధించాయో కూడా తెలిసింది. క్వార్టర్ ఫైనల్ లేదా సెమీ ఫైనల్‌లో జట్ల మధ్య మ్యాచ్ టై అయినా లేక రద్దైన
గ్రూప్ స్టేజిలో విజయం సాధించిన జట్లకు ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా అనేది తెలుసుకుందాం?

క్వార్టర్ ఫైనల్‌లోకి అర్హత సాధించిన 8 జట్లక ఇక నుంచి సమరం ఉత్కంఠ భరితంగా సాగనుంది. ముఖ్యంగా వర్షం కారణంగా లేదా మ్యాచ్ టై అయితే గ్రూప్ స్టేజిలో ఎక్కువ పాయింట్ల సాధించిన జట్లే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

World Cup: What happens if a quarter-final is abandoned or tied?

ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వరల్డ్ కప్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాలా నిబంధనలను మార్చిన విషయం తెలిసదే. ఈ నిబంధనల్లో భాగంగానే క్వార్టర్ ఫైనల్ లేదా సెమీ ఫైనల్‌లో జట్ల మధ్య ఏదైనా మ్యాచ్ టై లేదా రద్దైతే... గ్రూప్ స్టేజిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్టుకే టోర్నమెంట్లో ముందుకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

పూల్ బిలో అగ్రస్ధానంలో భారత్ ఉండగా, రెండో స్ధానంలో దక్షిణాఫ్రికా, మూడవ స్ధానంలో పాకిస్ధాన్, నాల్గవ స్ధానంలో వెస్టిండిస్‌లు ఉన్నాయి. అదే పూల్ ఏలో మొదటి స్ధానంలో న్యూజిలాండ్, రెండో స్ధానంలో ఆస్టేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి.

సెమీ ఫైనల్స్‌లో కూడా ఇదే నిబంధన వర్తించనుంది. వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్ మార్చి 29న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఒక వేళ ఫైనల్ మ్యాచ్‌ గనుక టై అయితే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ను ప్రవేశపెడతారు.

క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్:

పూల్ ఏ నుంచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్లు: న్యూజిలాండ్, ఆస్టేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక

పూల్ బి నుంచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్లు: ఇండియా, దక్షిణాఫ్రికా వెస్టిండిస్, పాకిస్ధాన్

క్వార్టర్ ఫైనల్ 1 - మార్చి 18 (బుధవారం) - శ్రీలంక Vs దక్షిణాఫ్రికా - సిడ్నీ ( ఉదయం 9 గంటలకు )

క్వార్టర్ ఫైనల్ 1 - మార్చి 19 (గురువారం) - బంగ్లాదేశ్ Vs భారత్ - మెల్‌బోర్న్ ( ఉదయం 9 గంటలకు )

క్వార్టర్ ఫైనల్ 3 - మార్చి 20 (శుక్రవారం) - ఆస్టేలియా Vs పాకిస్ధాన్ - అడిలైడ్ ( ఉదయం 9 గంటలకు )

క్వార్టర్ ఫైనల్ 4 - మార్చి 21 (శనివారం) - న్యూజిలాండ్ Vs వెస్టిండిస్ - వెల్లింగ్టన్ ( ఉదయం 6.30 గంటలకు )

సెమీ పైనల్స్ 1 - మార్చి 24 (ఆక్లాండ్)

సెమీ పైనల్స్ 2 - మార్చి 26 (సిడ్నీ)

మార్చి 29 - ఫైనల్ (మెల్ బోర్న్)

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X