వింటర్ ఒలింపిక్స్: వణుకుతూనే ఫైనల్‌కు చేరుకున్న షాన్ వైట్

Posted By: Subhan
Winter Olympics 2018: White almost perfect as he advances to halfpipe final

హైదరాబాద్: నాలుగు రోజులుగా జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో క్రీడాకారులు చలికి వణుకుపోతూనే ఫైనల్ వరకూ చేరుకున్నారు. మంగళవారం ప్యాంగ్ చంగ్ వేదికగా జరిగిన హాఫ్ పైప్ క్రీడలో షాన్ వైట్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇప్పటికీ యునైటెడ్ స్టేట్స్ మూడు స్వర్ణాలు గెలచుకోగా వాటితో జత చేసేందుకు మరో స్వర్ణం కోసం పోటీ పడుతున్నాడు వైట్.

స్కేట్ బోర్డింగ్ స్టైల్స్‌లో ఒకటైన హాఫ్ పైప్ స్కేటింగ్‌లో ఎవరైతే ఎక్కువ సేపు గాలిలో ఉండగలరో వారే విజేతలుగా నిలుస్తారు. ఇలా 12 మంది క్రీడాకారులు పాల్గొన్న పోటీలో వైట్ 98.5 స్కోరును నమోదు చేశాడు. మిగిలిన రెండు స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన స్కాటీ జేమ్స్ 96.75 పాయింట్లు, జపాన్‌కు చెందిన అయూము హిరానో 95.25 పాయింట్లను నమోదు చేశారు.

షాన్ వైట్ మొదటి సారి స్వర్ణాన్ని టురిన్‌లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ 2006లో గెలిచాడు. ఇక రెండో స్వర్ణాన్ని 2010లో వాన్‌కౌర్‌లో సాధించాడు. గతేడాది జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానాన్ని సంపాదించగా ఈ ఏడాది స్వర్ణం కోసం పోటీపడుతున్నాడు. ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 15 క్రీడల్లో 102 ఈవెంట్లలో నిర్వాహకులు పోటీలు నిర్వహిస్తున్నారు.

ఈ గేమ్స్‌లో ఐస్ హాకీ, ఆల్పైన స్కీయింగ్, బయోథ్లాన్, బాబ్ స్లీగీ, క్రాస్ కంట్రీ స్కీయింగ్, కర్లింగ్, ఫిగర్ స్కేటింగ్, ఫ్రీ స్టయిల్ స్కేటింగ్, లూగే, నోరాడిక్ కంబైన్డ్, స్పీడ్ స్కేటింగ్, స్కెలిటన్, స్కీజంపింగ్, స్నోబోర్డింగ్ ఉన్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 25 వరకూ జరిగే ఈ వింటర్ ఒలింపిక్స్‌లో 92 దేశాలకు చెందిన 3వేల మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 12:50 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి