న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics: రెండో రోజు.. భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇదే.. బరిలో తెలుగు తేజాలు!

What To Watch Today July 24 Tokyo Olympics Indian Schedule And Events

టోక్యో: యావత్ క్రీడా ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక టోక్యో ఒలింపిక్స్​లో రెండో రోజు(జులై 24) భారత అథ్లెట్లు మొత్తం 10 ఈవెంట్స్‌లో పోటీపడనున్నారు. అందులో మెడల్ ఆశిస్తున్న షూటింగ్ ఈవెంట్ కూడా ఉంది. ఉదయం 5 గంటలకే ఈ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఆర్చరీ మిక్స్​డ్​ ఎలిమినేషన్​ రౌండ్​లో అతాను దాస్​, దీపికా కుమారి బరిలోకి దిగనున్నారు. మరోవైపు భారత పురుషుల హాకీ టీమ్​ న్యూజిలాండ్​ జట్టుతో పోటీ పడనుండగా... మహిళల హాకీ టీమ్ నెథర్లాండ్స్‌తో తలపడే అవకాశం ఉంది. వీరితో పాటు మహిళల హాకీ, బాక్సింగ్​, బ్యాడ్మింటన్​, రోయింగ్​, షూటింగ్​, వెయిట్​ లిఫ్టింగ్​ వంటి క్రీడల్లో భారథ అథ్లెట్లు పాల్గొననున్నారు.

శనివారం జరగనున్న టెన్నిస్​ పోటీల్లో తెలుగు తేజాలు కూడా బరిలో దిగనున్నారు. టెన్నిస్​ మహిళల డబుల్స్​లో సానియా మీర్జా, అంకితా రైనా ఆడనుండగా.. పురుషుల సింగిల్స్​లో సుమిత్​ నగాల్​ పోటీపడనున్నాడు. మరోవైపు బ్యాడ్మింటన్​ డబుల్స్​లో సాత్విక్​ సాయిరాజ్​ రాంకిరెడ్డి, చిరాగ్​ శెట్టి ద్వయం పోటీ పడనుంది.

ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత షెడ్యూల్

1.ఈక్వెస్ట్రైన్- వ్యక్తిగత డ్రెస్సెజ్ గ్రాండ్ ప్రిక్స్ డే1

2. షూటింగ్- మహిళల 10 మీటర్లు ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్స్- ఉదయం 5 గంటలకు

3. టేబుల్ టెన్నిస్- పురుషుల సింగిల్స్ ప్రిలిమినరీ రౌండ్ -ఉదయం 5.30 గంటలకు

4.టేబుల్ టెన్నిస్- మహిళల సింగిల్స్ ప్రిలిమినరీ రౌండ్- ఉదయం 5.30 గంటలకు

5. ఆర్చరీ- మిక్స్‌డ్ టీమ్ రౌండ్ ఆఫ్ 16- ఉదయం 6 గంటలకు

6. హాకీ- భారత పురుషులు vs న్యూజిలాండ్- ఉదయం 6.30 గంటలకు

7. షూటింగ్- మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ ఉదయం 7.15 నిమిషాలు

8. జూడో- మహిళల 48 కేజీ ఆల్‌రౌండర్స్- ఉదయం 7.30 గంటలకు

9. టేబుల్ టెన్నిస్- మిక్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16- ఉదయం 7.50 గంటలకు

10. రోయింగ్- పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ హీట్స్- ఉదయం 7.50 గంటలకు

11. బాక్సింగ్- మహిళల వెల్టర్ వెయిట్- ఉదయం 8 గంటలకు

12. షూటింగ్- పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ క్వాలిఫికేషన్-9.30 గంటలకు

13. వెయిట్ లిఫ్టింగ్- మహిళల 49 కేజీ- ఉదయం 10.20 గంటలకు

14. ఆర్చరీ- మిక్స్‌డ్ టీమ్ మెడల్ రౌండ్స్- ఉదయం 10.45 గంటలకు

15. షూటింగ్- పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఫైనల్- మధ్యాహ్నాం 12 గంటలకు

16. బ్యాడ్మింటన్- పురుషుల డబుల్స్- చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ vs లీ యంగ్-చి లిన్ వాంగ్(చైనీస్ తైపీ)

17.బడ్మింటన్-పురుషుల సింగిల్స్- బీ సాయిప్రణీత్ vs మిశా జిల్‌బెర్మన్(ఇజ్రాయిల్)- మధ్యాహ్నం 1 గంటలకు

18. బాక్సింగ్- పురుషుల వెల్టర్ వెయిట్ రౌండ్ 32- వికాస్ క్రిష్ణన్ vs సెన్రెట్స్ క్విన్సీ - మధ్యాహ్నం 3.54 గంటలకు

19. హాకీ- భారత మహిళలు vs నెదర్లాండ్స్- సాయంత్రం 5.15 గంటలకు

Story first published: Friday, July 23, 2021, 22:38 [IST]
Other articles published on Jul 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X