న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంతర్జాతీయ చెస్ టోర్నీలో సత్తా చాటిన మనోళ్లు

Wei, Padmini Win Asian Continental Championship 2018

మకాటి: మరోటోర్నీలో భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపింది ఒడిశా క్రీడాకారిణి. తన అజేయ ప్రదర్శనతో భారత చెస్‌ అంతర్జాతీయ మాస్టర్‌ (ఐఎం) క్రీడాకారిణి పద్మిని రౌత్‌ ఆసియా చాంపియన్‌గా నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో పద్మిని మొత్తం ఏడు పాయింట్లు సాధించి కియాన్‌యున్‌ గాంగ్‌ (సింగపూర్‌)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా పద్మినికి విజేతగా నిలిచి టైటిల్‌ దక్కించుకుంది. ఆ తర్వాత కియాన్‌యున్‌ గాంగ్‌ రన్నరప్‌గా నిలిచింది.

ఒడిశాకు చెందిన 24 ఏళ్ల పద్మిని 5 గేముల్లో గెలిచి, 4 గేమ్‌లను 'డ్రా' చేసుకుంది. ఓపెన్‌ విభాగంలో భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. ఇదే టోర్నీలో మరికొందరు భారత ప్లేయర్లు సూర్యశేఖర గంగూలీ నాలుగో స్థానంలో నిలువగా... ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఎం.ఆర్‌.లలిత్‌ బాబు ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తాజా ఘనతతో పద్మిని... 37 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో విజేతగా నిలిచిన ఎనిమిదో భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

గతంలో రోహిణి ఖాదిల్కర్‌ (1981, 1983), అనుపమ గోఖలే (1985, 1987) రెండేసి సార్లు ఈ టైటిల్‌ నెగ్గగా... భాగ్యశ్రీ థిప్సే (1991), కోనేరు హంపి (2003), తానియా సచ్‌దేవ్‌ (2007), ద్రోణవల్లి హారిక (2011), భక్తి కులకర్ణి (2016) ఆసియా చాంపియన్స్‌గా నిలిచారు.

చైనాకు చెందిన వాంగ్ జూ మహిళల విభాగంలో 7.5 పాయింట్లతో తరువాతి స్థానంలో నిలిచింది. ఆమె తర్వాతి స్థానంలో వియత్నాంకు చెందిన హాంగ్ తి బావో ఏడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. వీరితో పాటు మరో ఐదు ప్లేయర్లు ఒకే స్కోరు సాధించడంతో టైగా మిగిలిపోయారు. వియత్నాంకు చెందిన ఫామ్ లే తావ్ జూయెన్, జానెలె మా ఫ్రాయెన్, చైనాకు చెందిన జాంగ్ క్సియోలు ఒకే స్కోరు సంపాదించారు.

Story first published: Thursday, December 20, 2018, 20:26 [IST]
Other articles published on Dec 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X